
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేను బీటెక్ కంప్లీట్ చేశాను. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను.
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! నేను బీటెక్ కంప్లీట్ చేశాను. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకూ నా కాన్‌సెన్‌ట్రేషన్ అంతా నా కెరీర్ మీద, పేరెంట్స్ మీద ఉండేది. త్రీ మంత్స్ బ్యాక్ బస్‌లో వస్తున్నప్పుడు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని పరిచయం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మా రిలేటివ్స్ కూడా అని తెలిసింది. కామన్ ఫ్రెండ్స్‌కి ఫ్రెండ్ కావడంతో ఫేస్ బుక్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను. తన బిహేవియర్ బాగా నచ్చింది.
నేనంటే తనకి కూడా ఇష్టమేనని అర్థమయ్యింది. బట్ మా పేరెంట్స్‌కి ఇవన్నీ నచ్చవు. లవ్ అంటే ఒప్పుకోరు. అందుకే కావాలని గొడవ పెట్టుకుని తనతో మాట్లాడం మానేశాను. వన్ ఇయర్‌లో జాబ్ తెచ్చుకుని ఇంట్లో ఒప్పించాలని ఉంది. బట్ తను మిస్ అయిపోతాడేమో అని చాలా భయంగా ఉంది సార్! ఇప్పుడు నేనేం చేయాలి సార్? – పవిత్ర (పేరు మార్చడమైంది)
మగాళ్లందరూ బాడ్ బాయిస్ కదా చెల్లెమ్మా!! ‘కానీ, వీడు తుంటరి అని చెబుతారు కదా సార్?’ నేనలా చెప్పలేదే! ‘చెబుతారు సార్!!’ లేదే..! ‘త్రాష్టుడు, దుర్మార్గుడు, డర్టీ ఫెలో, డేంజరస్ డూడ్...’ అయ్యో.. నా నోట్లో లేని మాటలు పెడుతున్నావు! ‘సార్ నాకు మీరు బాగా తెలుసు. ఆ అబ్బాయి జాబ్ ఉందికదా అని.. నిన్ను ఇలా ట్రీట్ చేస్తాడు. అసలు వాడి ట్రాప్‌లో పడొద్దు.’అవ్వ!! ‘మీరు ఎవరి లవ్‌నీ పండకుండా చేసే సాడిస్ట్ అనుకుంటారు సార్’ అవ్వ! అవ్వ!! ‘ఒక రోజు మెగా బాయ్స్ అంతా వచ్చి... మిమ్మల్ని... కుమ్మేస్తారు!!’
నీకేదో పర్సనల్‌గా నా మీద ఒపీనియన్ ఉండొచ్చు కానీ ఇలా........ ‘ఇంకేం చెబుతారు సార్ అమ్మాయికి? వేరే ఏమయినా చెబుతారా? ఎప్పుడయినా చెప్పారా? కాపురాలు కూల్చే వాళ్లను చూసేను.
బిఫోర్ కాపురం కూల్చే వాళ్లను మిమ్మల్నే చూస్తున్నా...’ ఏమైంది నీలాంబరీ? ఇవాళ రెచ్చిపోతున్నావు? ఇది నా మాట కాదు సార్... టోటల్‌గా ఆంధ్రా తెలంగాణా లవర్స్ పెయిన్ సార్’ ఛీ... పో. నాకంత సీన్ ఉందంటావా? అబ్బా ఏమి మురిసిపోతున్నారు సార్!’ ఇదమ్మా పవిత్రా! ప్రపంచం. మనం అనేకునే దానికి ఇతరులు రిసీవ్ చేసుకునే దానికి నక్కకు నాకలోకానికి ఉండే తేడా. ఏది చేసినా తొందర పడకుండా ఉద్యోగం వచ్చాక చూద్దాం. ఓకే!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com