
హాయ్ సర్! నా ఫ్రెండ్ ఒక అబ్బాయిని ఆరేళ్లుగా లవ్ చేస్తోంది. ఆ అబ్బాయి కూడా లవ్ చేస్తున్నాడు. కానీ, వీళ్ల ప్రాబ్లమ్ ఏంటంటే.. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని లవ్ చేస్తూ... చాలా మంది అమ్మాయితో అఫైర్స్ పెట్టుకున్నాడు. కానీ ఆ అబ్బాయిని నా ఫ్రెండ్ ఇంకా లవ్ చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా వినడం లేదు అన్నయా! తను నా ఫ్రెండ్ దగ్గర మనీ కూడా తీసుకుంటాడు. అలా ఇవ్వద్దు అన్నా ఆమె వినదు. తాను పూర్తిగా మారానని నమ్మిస్తున్నాడు. ఎంత వరకు ఆ అబ్బాయిని నమ్మవచ్చు? ప్లీజ్... మీరే హెల్ప్ చెయ్యండి అన్నయ్యా! – దుర్గ
తీసుకున్న ప్రేమను తిరిగి అందరికీ పంచుతున్నారు..! తీసుకున్న అప్పు ఎవరికీ తిరిగి ఇవ్వడం లేదు..! కానీ, అమ్మాయి మాత్రం అబ్బాయి చుట్టే తిరుగుతుంది..! పెద్ద తిరకాసు!!‘తిరిగి తిరిగి మీకు ఉత్తరం రాశారు.. పెద్ద తిరకాసు! సార్!!’ నాకు ఉత్తరం రాయడంలో తిరకాసు ఎక్కడుంది నీలూ? ‘సార్ మీకు ఛాన్స్ ఇస్తే అబ్బాయిలను తిట్టని తిట్టు తిప్పి తిప్పి తిడతారని తెలియక దుర్గ మీకు రాసింది. ఇక ఆన్సర్ మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. మీ ఆన్సర్ నేను కూడా చెప్పగలను సార్!’చెప్పు నీలు...! ‘వద్దులే సార్ మీ ఉత్తరానికి మీరే చెప్పుకోండి!’ ప్రేమ పారేయు వాడు...అప్పు రిటర్న్ కట్టనోడు... లవర్ కాదు... గాడిద.. సుమతీ!!
- ప్రియదర్శిని రామ్‌లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment