
హాయ్ అన్నయ్యా! నేను ఒక అబ్బాయిని లవ్ చేసాను. ఆ అబ్బాయికి నేను అంటే ఇష్టం. కానీ మా నేపథ్యాలు వేరు. మా పేరెంట్స్ ఒప్పుకోరు. వెళ్లిపోయి చేసుకుంటే పేరెంట్స్‌కి ఏమైనా అవుతుందేమోననే బాధ. ఏం చెయ్యాలి.. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్.! – నందిని
ఎందుకు కాదు! ‘ఏంటి సార్ అయ్యేది!’ పెయిన్ ఉండదా? ‘ఎందుకు సార్ పెయిన్!’ మోసి పోసి దాసి చేసినోళ్లకు పెయిన్ ఉండదా? ‘పోయెట్రీ వద్దు సార్.. ప్రోజ్ చెప్పండి’. ప్రోజ్ అంటే అదో రకం రోజ్ లాంటిదా? ‘మనుషులు మాట్లాడుకునే భాష సార్!’ ‘మీకో దండం పెడతా.. ఇలాంటి సోది రాస్తే ఉద్యోగం పోతది.. సార్.. ఎవరూ లవ్ డాక్టర్‌కి రాయరు! క్లినిక్ బంద్.. నీలాంబరి మిస్సింగ్.. అరటిపండు హుష్ కాకి.. అయిపోతుంది సార్!!’ నందినీ! నీ డౌట్ కరెక్టే. అమ్మానాన్నలకు చాలా బాధ కలుగుతుంది.
ప్రేమకు రెండే రెండు అవసరం... ‘ఒక అబ్బాయి ఒక అమ్మాయి.. కదా సార్!!’ నువ్వు పోయెట్రీ ఆపితే నేను రోజ్ చెబుతా... రోజ్ కాదు సార్ ప్రోజ్ సార్!’ ఏదో ఒకటి! ‘ఒకటి కాదు సార్ రెండు అన్నారు!!’ ఒకటి ప్రేమను నిలబెట్టుకే ఓర్పు. ఒకటి ప్రేమను సమాజంలో గెలిపించుకునే.. ధైర్యం. అప్పుడు ప్రేమ అందరి విజయం అవుతుంది. అందరి మన్ననలను గెలుస్తుంది.. ఇద్దరి ప్రేమ నలుగురికి పాఠం అవుతుంది. బ్లెస్ యు తల్లీ!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment