
హాయ్ అన్నా, నేను ఒకరిని లవ్ చేశా. మొదట్లో బాగానే ఉండేవాళ్లం కానీ, కొంతకాలానికి తన బిహేవియర్‌లో చాలా మార్పు వచ్చింది. ఏంటని అడిగితే.. ‘నువ్వు బ్లాక్‌గా ఉన్నావు, నా ఫ్రెండ్స్ నిన్ను వదిలెయ్యమంటున్నారు’ అని చెప్పాడు. చాలా గొడవలయ్యాయి. చివరికి విడిపోయాం. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా ఇయర్స్ పట్టింది. ఆ తరువాత స్టడీస్ కోసం వేరే ఊరు వెళ్లాను. అక్కడ మరో అబ్బాయి పరిచయమయ్యాడు. లవ్ అన్నాడు, ప్రాణం అన్నాడు. నమ్మాను. కానీ, కాలం గడిచే కొలదీ ‘మన పెళ్లి జరగదు’ అని చెబుతున్నాడు. ఎందుకు అని అడిగితే.. ‘‘మా అమ్మ చావు బతుకుల్లో ఉన్నప్పుడు.. నేను తనకి మాటిచ్చాను, తను ఎవరిని చూపిస్తే వాళ్లనే పెళ్లి చేసుకోవాలి, తప్పదు!’ అన్నాడు. మళ్లీ అదే బాధ, అదే డిప్రెషన్. నాకే ఎందుకు ఇలా జరగాలి?? నేను ప్రేమించడానికి పనికిరానా? అని బాగా ఏడ్చాను. అబ్బాయిలంతా అందాన్ని చూసి లేదా డబ్బుని చూసి పెళ్లిళ్లు చేసుకుంటారని అర్థమయ్యింది. నా అభిప్రాయం తప్పు అని ప్రూవ్ చేసేవాడు రావాలని కోరుకుంటున్నా కానీ.. నాకు కుజదోషం ఉందట. అలా ఉంటే జీవితాలు నాశనం అయిపోతాయా? డిప్రెషన్‌లోనే ఉంటారా? అసలు నేను ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలి? ప్లీజ్ చెప్పండి అన్నయ్యా.. ప్లీజ్!
– మీ చెల్లెలు
నా చిట్టి బంగారు తల్లి!! ఎవడమ్మా అన్నది నీకు కుజదోషం ఉన్నదనీ..? దోషం లేదు... గీషం లేదు... అలాంటి వెయ్యి దోషాలున్నా రాణించిన గ్రేట్ అమ్మాయిలు లెక్కలేనంతమంది ఉన్నారు.
డిప్రెషన్ని జుట్టు పట్టి ఈడ్చి.. ఒక తన్ను తన్ని.. బయటపడిన తెలుగు అమ్మాయిలలో నువ్వూ ఒక దానివి కావాలిరా బంగారం!! ‘రామ్ చెల్లెలా మజాకా! ఒక్కసారి గుండెలో రామ్ అన్నయ్యా.. అనుకో! దెబ్బకు డిప్రెషన్ దెయ్యం మూటగట్టుకొని పారిపోతుంది!! కదా.. సార్!?’ ఎగ్జాక్ట్‌లీ! పర్పెక్ట్‌గా చెప్పావు నీలూ..! ‘సార్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సార్! ఇట్లా డిప్రెషన్‌తో వేస్ట్ చేసుకోకూడదు కదా సార్!’
నలుపేంటీ.. అందమేంటీ.. ఆస్తి ఏంటీ.. ప్రేమకు ఇవి కనబడవు! కనబడ్డాయంటే అది ప్రేమ కాదు!! ‘భలే చెప్పారు సార్!’ నువ్విలా మోటివేట్ చెయ్యి నీలూ.... ఇంకా భలే చెబుతా!
‘సార్ మీ చెల్లెలు కూడా మోటివేట్ అయిపోయుంటుంది సార్.. డిప్రెషన్, గిప్రెషన్ జాన్తా నహి..! అని మంచి డ్రెస్ వేసుకుని క్వీన్‌లాగా కాలేజ్‌కి పోతుంది సార్!’ నీలూ.. ఎంత బాగా చెప్పావు! ఒక్కోసారి నిన్ను చూస్తుంటే... ‘ఆ.. చూస్తుంటే..? చెప్పండి సార్ ఏం అనిపిస్తుంది సార్???? చెప్పండి.. చెప్పండి.. ప్లీజ్....!’అబ్బా వద్దులే ఇంకోసారి చెబుతా నీలూ..! సార్ చెప్పకపోతే వన్ మంత్ అరటిపండు క్యాన్సిల్ సార్!’ రాణి లక్ష్మీబాయిలా.. రుద్రమదేవిలా.. మదర్ ఆఫ్ బాహుబలిలా... అనిపిస్తావు నీలూ...! ‘ఏంటో సార్! ఏంటో చెబుతారనుకున్నా..! ఏంటో చెప్పారు..! ఏంటో అనుకున్నా.. ఏంటో అనిపిస్తోంది.. ఏంటో....’
అరటిపండు ప్లీజ్!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment