
హాయ్ సార్..! నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నేను ప్రపోజ్ చేసిన టూ ఇయర్స్ తర్వాత, తను నన్ను వాళ్ల ఫ్రెండ్ ఇంటికి రమ్మని చెప్పి అక్కడ ఓకే చెప్పింది. అప్పటి నుంచి మేమిద్దరం ‘ఒకరి కోసం ఒకరం’ అన్నట్లు ఉన్నాం. తను నన్ను చూడకుండా ఒకరోజు కూడా ఉండదు. అయితే ఒకరోజు నాతో ఫోన్‌లో మాట్లాడుతుండగా వాళ్ల ఇంట్లో వాళ్లు విని, ఫోన్ గుంజుకుని, కాసేపటి తర్వాత తిరిగి కాల్ చెయించారు. ఆమె కాల్ చేసి ‘‘నువ్వు ఎవరివో నాకు తెలీదు, ఇంకోసారి కాల్ చెయ్యకు’’ అని ఫోన్ కట్ చేసింది. తనకి నేనంటే చాలా ఇష్టం. తను నాతో మాట్లాడక 11 నెలలు దాటింది. తను నన్ను మరిచిపోయిందా అంటే.. అలా కూడా లేదు. రోజూ నన్ను చూస్తూ వెళ్తుంది. తను లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – నవీన్
కొత్తగా ఆలోచించు బ్రో...! ‘ఏంటి సార్ కొత్తగా ఆలోచించేది.?’ మమ్మీడాడీ ‘నవీన్’ అని పేరు పెట్టాక..... ‘నవీనంగా ఆలోచించమంటారా సార్, అదే వాళ్ల మమ్మీడాడీ నవీన్‌కి ప్రాచీన్ అని పేరు పెట్టి ఉంటే ఓల్డ్‌గా ఆలోచించమని చెప్పేవారా సార్?’ అసలు ఏ మమ్మీడాడీ వాళ్ల కొడుక్కి ‘ప్రాచీన్’ అన్న పేరు పెట్టరు నీలూ...! ‘నవ్వకండి సార్! పోని సంస్కార్ అని పెట్టి ఉంటే ఓల్డ్‌గా ఆలోచించమని చెప్పేవారా సార్??’ సంస్కార్ అని పేరు ఉంటే మనకెందుకు ఉత్తరం రాస్తాడు నీలూ? ‘సార్ మీరు మరీ ఎక్కువగా నవ్వుతున్నారు.
నన్నూ నవీన్‌ని ఫూల్ చేసి మరీ నవ్వుతున్నారు. దమ్ముంటే నవీనమైన ఆన్సర్ ఇవ్వండి సార్!’ అరే... దమ్ముండాల్సింది నవీన్‌కి. నాకు కాదు...!! ‘ఏంటో సార్, ఇవాళ అన్నీ తిప్పితిప్పి మాట్లాడుతున్నారు. ఎండాకాలం ప్రభావమా సార్??’ నీకు ఉద్యోగం సద్యోగం ఉంటే... పోయి అమ్మాయి వాళ్ల నాన్నకు చెప్పు. పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటానని. ‘చెప్పెయ్యి నవీన్. మన దమ్మేంటో చూపించు నవీన్!’
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment