హలో లవ్ డాక్టర్ గారు..! ఎలా ఉన్నారు..? ఈ సమస్య నాది కాదు సార్, మా అన్నయ్యది. మా అన్నయ్య త్రీ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఆ అమ్మాయి మా అన్నయ్యకు ఓకే చెప్పిందట. ఆ విషయం తెలిసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఏదో గొడవ జరిగింది. ‘రిలేషన్‌షిప్‌లో గొడవలు కామన్ కదా’ అని నేను వాళ్ల మధ్యకి వెళ్లలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు మా అన్నయ్యకి బ్రేకప్ చెప్పేసిందట. ఏమైందని ఆరాతీస్తే... ‘నేను మా నాన్నకు మాటిచ్చాను, ఎవరినీ లవ్ చెయ్యనని’ అంటోంది. ‘మరి ఈ విషయం మొదట్లోనే చెబితే మా అన్నయ్య నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కాదుగా’ అని అడిగితే ఆ అమ్మాయి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెయ్యమంటారు సార్. మా అన్నయ్య ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. తను మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – నవ్య
యూత్......!! మైండ్ నిలకడగా ఉండదు.....!! ఉండదు కాబట్టే ఎవరో ఒకరు నచ్చుతూ ఉంటారు....!! ఆ తర్వాత నిలకడ ఉండదు కాబట్టి వద్దనుకుంటారు....!! మళ్లీ కావాలనుకుంటారు....!! కొంతమంది మైండ్‌లో ఉన్నది చెప్పకుండా గేమ్స్ ఆడుతూ ఉంటారు...!! కానీ మీ అన్నయ్యను ప్రేమించిన అమ్మాయి గేమ్స్ ఆడటం లేదు..!! ‘ఏంటి సార్..!? నోటికొచ్చినట్లు చెబుతున్నారు..!??? ముందు లవ్వు అంది. ఇప్పుడు పో అంటోంది. దీనికంటే గేమ్స్ ఏముంటాయి సార్? మీరు ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నారు. మీకు రాసింది కూడా అమ్మాయే అని గుర్తించడం లేదు. యు డూ జస్టిస్ టూ నవ్య సార్!’ చెప్పానుకదా నీలూ! అమ్మాయికి నవ్య వాళ్ల అన్నయ్య ఫ్రెండ్‌గా ఓకే అనిపించాడు. అందుకే త్రీ ఇయర్స్ ఏం కమిట్ కాలేదు. మనోడు ఉండలేక చాలా సెంటిమెంటల్ అయిపోయి.. ఆ అమ్మాయిని లవ్వులోకి దించాడు. ఆ అమ్మాయికి తన లవ్ గురించి తెలియదు. తనకి అబ్బాయి లవ్వే తెలుసు. ఆ అబ్బాయి లవ్వే తన లవ్ అనుకుంది. బుట్టలో పడింది. ఇప్పుడు మైండ్ ఓపెన్ అయ్యి తుర్రుమంది. ‘అంటే అబ్బాయిలు లవ్ గురించి ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు అంటారు!! వాళ్ల లవ్వే అమ్మాయిలు రిప్లెక్ట్ చేసి పుసుక్కున ఓకే చెప్పి, తర్వాత నిలకడగా ఆలోచించి టాటా–బైబై చెబుతురన్నమాట. అర్థమైందా నవ్యా..! అన్నయ్యకు చెప్పు లవ్ నాచురల్‌గా ఇద్దరికీ కలగాలి. ప్రెజర్ మంచిది కాదు అని. నెక్ట్స్ టైమ్ బెటర్ లక్!! కరెక్ట్‌గా చెప్పానా సార్?????’ అబ్బబ్బబ్బబ్బా.. నీలూ యూ ఆర్ గ్రేట్!!!!!!
- ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment