హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ఇంటర్‌లో ఉండగా లవ్ చేశాను. తను కూడా ఓకే చెప్పింది. టూ ఇయర్స్ మా లవ్ చక్కగా సాగింది. అయితే మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసి ఆమెను బాగా కొట్టారు. అప్పటి నుంచి నాకు కాల్ చెయ్యడం మానేసింది. నేను కాల్ చేసినా, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం, మాట్లాడటం మానేసింది. ఒకసారి తను నన్ను కలిసి.. ‘నన్ను మరచిపో ప్లీజ్’ అని చెప్పింది. నాకు ఆ అమ్మాయి కావాలి సార్. తనని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు. నేను తనని ప్రాణంగా ప్రేమించాను. వాళ్ల ఇంట్లో ఏమైందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్. – సిద్ధు
ఏం అర్థం కాలేదు సిద్ధూ...??? అమ్మాయిని కొట్టిన విషయం అర్థం కాలేదా??? అమ్మాయి భయపడుతోందన్న విషయం అర్థం కాలేదా??? అమ్మాయి ‘నన్ను మరచిపో ప్లీజ్’ అని రిక్వెస్ట్ చేసిన సంగతి అర్థం కాలేదా??? అమ్మాయికి నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారీ హండ్రెడ్ టైమ్స్ కలిగే రిస్క్ నీకు అర్థం కాలేదా??? అమ్మాయి ఒక వస్తువు కాదు. తను ఒక మనిషి, ఒక కుటుంబంలో భాగం, ఒక ఇంటి గౌరవమన్న విషయం నీకు అర్థం కాలేదా సిద్ధూ??? కొంచెం స్పీడ్ తగ్గించు..! కొంచెం ఆలోచించు...!! నీ ఇంట్లో ఉన్న ఒక చెల్లెలో.. కజిన్ సిస్టరో ఈ సిట్యుయేషన్‌లో ఉంటే నువ్వు ఒక అన్నయ్యగా తన ప్రేమికుడికి ఏం అడ్వైజ్ ఇస్తావో ఆలోచించు సిద్ధూ! ‘మిమ్మల్ని అడ్వైజ్ అడిగితే.. సిద్ధూని అడ్వైజ్ ఇవ్వమంటున్నారేంటి సార్???’కరెక్ట్ నీలూ..! సిద్ధూ అడ్వైజ్ ఇవ్వాలి. తనకు తానే అడ్వైజ్ ఇచ్చుకోవాలి! అమ్మాయి పెయిన్ అర్థం చేసుకోవాలి!!
- ప్రియదర్శిని రామ్
Comments
Please login to add a commentAdd a comment