హాయ్ సార్..! నేనొక అమ్మాయిని వన్ ఇయర్ నుంచి ట్రూగా లవ్ చేస్తున్నాను. తనూ నన్ను లవ్ చేస్తోంది. తనకోసం నేను చాలా వదులుకున్నాను. తనకి వాట్సాప్, ఫేస్‌బుక్‌లంటే ఇష్టం ఉండవని తెలిసి, వాటిని కూడా డిలిట్ చేశాను. ఎప్పుడూ ‘నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం’ అని చెబుతూ ఉంటుంది కానీ ఇంటికి వెళ్తే ఫోన్ చెయ్యదు. ఎక్కడైనా బయట కనిపిస్తే మాట్లాడదు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అడిగితే.. ‘మా ఇంట్లో అసలు ఒప్పుకోరు, అడిగినా వేస్ట్’ అని చెబుతోంది. నాకేమో తను కావాలి. కానీ తను నన్ను అర్థం చేసుకోవడం లేదు సార్! ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్లీజ్! – శ్రీ
నీది ట్రూ లవ్ బ్రో...!! ‘సార్..! మరి అమ్మాయిది ఏం లవ్ సార్???????’ వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి లవ్..! ‘అంటే అంతా డిజిటల్..! నథింగ్ రియల్..!! అంటున్నారా సార్...?!’ జస్ట్ టైమ్‌పాస్ లవ్ నీలూ....!! ‘మరి శ్రీ... వాట్సాప్, ఫేస్‌బుక్‌లు డిలిట్ చేసేశాడు కదా సార్...! ఇప్పుడు ఎలా సార్????’ అమ్మాయిని కూడా మెమరీ నుంచి డిలిట్ చేయాలి నీలూ...! ‘ఏంటి సార్..! ఇవాళ అబ్బాయిలకి ఫేవర్‌గా మాట్లాడుతున్నారు.. మీకు సిస్టర్స్ మీద లవ్ తగ్గిందా సార్????’ అది కాదు నీలూ..! అమ్మాయికి శ్రీ అంతగా నచ్చలేదు..! ‘అంటే ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేసేలాంటి లవ్ అమ్మాయికి కలగలేదా సార్?’ కలగలేదు కాబట్టి... శ్రీ కూడా...... ‘టేక్ ఇట్ ఈజీ పాలసీ.. అంటారా సార్..!’ అని నవ్వింది నీలాంబరి!
- ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment