
హాయ్ సార్! నేను, ఒక అమ్మాయి టూ ఇయర్స్‌గా సిన్సియర్‌గా లవ్ చేసుకుంటున్నాం. మా ఇంట్లో మా విషయం తెలిసి ఓకే అన్నారు కూడా. ఇక వాళ్ల ఇంట్లో చెబుదాం అనుకునే లోపే తెలిసిపోయింది. ఆ అమ్మాయి వాళ్ల బావే మా విషయం చెప్పేశాడట. తరువాత తను కొన్నిరోజులు సీక్రెట్‌గా మాట్లాడింది కానీ, తరువాత ఏమైందో ఏమో సడన్‌గా మాట్లాడటం మానేసింది. వాళ్ల బావ, వాళ్ల ఇంట్లో వాళ్లు కలిసి తనకు నా గురించి చాలా బ్యాడ్‌గా చెప్పడమే కారణం అని తెలిసింది. నేను వాళ్ల అమ్మగారి జాబ్ పోగొట్టడానికి ప్రయత్నించానని, నేను మంచివాడిని కాదని చాలా చెప్పారట. సరేలే ఎప్పటికైనా నిజం తెలుసుకుని వస్తుందిలే అనుకుంటే.. ఇప్పుడు తను వాళ్ల బావని లవ్ చేస్తోందట. తననే పెళ్లి చేసుకుంటా అంటోంది. నేను తట్టుకోలేకపోతున్నా సార్! మామూలుగా ఉండలేకపోతున్నా. మీరే ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్. – అభిరామ్
అభిరామ్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ! ఏదీ సింపుల్‌గా దొరకదు కావాలంటే నువ్వు కొంతమంది జీవితాలను చదివి చూడు అంతెందుకు.. మీ ఇంట్లోనే అమ్మకో.. నాన్నకో.. ఏదైనా సాధించాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందో చూడు.. అయినా ఏదైనా చాలా ఈజీగా దొరికితే దానికి మనం విలువ ఇవ్వం! తానొక అమ్మాయి.. నీకు నచ్చిన అమ్మాయి... ఒకప్పుడు తనకు కూడా నువ్వంటే ఇష్టం! ఇప్పుడు ఇష్టం లేదు! ‘సార్ ఇష్టం లేదని ఎలా చెబుతారు సార్? బావ వీళ్ల ప్రేమలో పోశాడు కదా సార్ పాపిష్టి అనుమానాన్ని... అందుకే కదా సార్ అమ్మాయి.. అభిరాంకి థ్యాంక్యూ వెరీ మచ్ చెప్పి ‘బావా.. బావా పన్నీరు..’ అని డ్యూయెట్లు పాడుకుంటోంది సార్!’ ఇష్టం ఒకరు ఆపితే ఆగదు.
ఆగిందంటే అది ఇష్టం కాదు! ఎట్రాక్షన్ మాత్రమే.. అభిరాం గుడ్ లుకింగ్ ఫెలో కాబట్టి అమ్మాయి ఎట్రాక్ట్ అయ్యింది! ‘సార్.. మీరు అభిరాంని చూసినట్లే మాట్లాడుతున్నారు సార్.. మీకెలా తెలుసు అభిరాం గుడ్ లుకింగ్ అని???’ అంత గుడ్ మనస్సు ఉన్న అభిరాం గుడ్ లుకింగ్ అయ్యే ఉంటాడు నీలూ... ‘ఏదో కానివ్వండి సార్ ఈ కాలమ్ మీది.. మీరు ఏది రాసినా భరించాలి.. అసలు విషయానికి రండి సార్!’ నువ్వు వాళ్ల అమ్మగారి ఉద్యోగానికి ఎసరు పెట్టావంటే నిన్ను వదిలేసిందంటే.. ఫ్యూచర్‌లో ఇలాంటి ఏ పనికిరాని మాటవినో నిన్ను తన్ని తగలేస్తుంది. అలాంటి వీక్ పర్సన్‌ని ప్రేమించి జీవితాన్ని తన్ని తగలేసుకునే బదులు.. మూవ్ ఫార్వర్డ్ బ్రో ‘అబ్బా ఫైనల్లీ ఫస్ట్ టైమ్ అమ్మాయిది తప్పు అన్నందుకు ఇదిగో సార్ డబుల్ అరటిపండు!’
Comments
Please login to add a commentAdd a comment