
హాయ్ అన్నయ్యా...! నేను ఒక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. మాది ఐదేళ్ల ప్రేమ. మా పెళ్లికి వాళ్ల ఇంట్లో ఒప్పుకున్నారు కానీ మా ఇంట్లో ఒప్పుకోవడంలేదు. కారణం మా నేపథ్యాలు వేరు. ఎంత ప్రాధేయపడినా మా వాళ్లు మా ప్రేమను అంగీకరించడంలేదు. ‘మా పరువు పోతుంది, ముందు నువ్వు జాబ్ మానేసి ఇంట్లో కూర్చో’ అంటున్నారు. అన్నయ్యా... నేను నా పేరెంట్స్‌ని కాదని ఆ అబ్బాయితో ఉండలేను. అలా అని మా వాళ్లు చెప్పినట్లు వేరే అబ్బాయినీ పెళ్లి చేసుకోలేను. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. మా పేరెంట్స్ కనీసం ఆ అబ్బాయిని కలవడానికి కూడా ఇష్టపడ్డంలేదు. నేను ఇష్టపడ్డ అబ్బాయి చాలా మంచివాడన్నయ్యా. నన్ను నా పేరెంట్స్ నుంచి దూరం చెయ్యాలనుకోడు. నాకు నా పేరెంట్స్‌తో పాటు తను కూడా కావాలి. ప్లీజ్ అన్నయ్యా నాకో మంచి సలహా ఇవ్వండి. కులం కోసం, పరువుకోసం నా ప్రేమను చంపుకోలేను. మా పేరెంట్స్‌కి అర్థమయ్యేలా నా ప్రేమను ఎలా గెలిపించుకోవాలి? – శ్రావ్య
డోంట్ వర్రీ బంగారం... నీ ప్రేమ గెలుస్తుంది. మీ పేరెంట్స్ నీ ప్రేమను ఒప్పుకుంటారు. మీది హ్యాపీ ఎండింగ్. ‘ఎలా చెబుతున్నారు సార్ అంత కచ్చితంగా??’ అమ్మాయిని ఇచ్చే ముందు పేరెంట్స్ ఏం చూస్తారు నీలూ..? ‘అమ్మాయికి తగిన ఫ్యామిలీనా కాదా? అబ్బాయి మంచోడా కాదా? కుటుంబాన్ని పోషించగలడా లేదా? సమాజంలో ఇద్దరూ మంచి పేరు తెచ్చుకోగలరా లేదా?’ సింపుల్‌గా చెప్పాలంటే.. అమ్మాయి సుఖపడుతుందా లేదా అని చూస్తారు.. వాళ్ల బిడ్డను అంతగా ప్రేమించి, నిండుగా గౌరవించే అల్లుడు దొరకడం అదృష్టమేగా..!? ‘ఈ విషయం పేరెంట్స్‌కి ఎవరు చెప్పాలి సార్??’ నువ్వెళ్లు నీలూ...! ‘లేదులే సార్..! ఈ సమాధానం పేరెంట్స్‌కి పంపుతా సార్!’ శభాష్ నీలూ...!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment