
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నా. తనకు లవ్ ప్రపోజ్ చేశాను. ఓకే అంది. ఎంజాయ్ చేశాం. సడన్‌గా ఏమైందో తెలీదు, నాతో మాట్లాడటం మానేసింది. ఏమైందని గట్టిగా అడిగితే ‘మ్యారేజ్ అయిపోయింద’ని చెప్పింది. అప్పటి నుంచి తనని మరచిపోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా. డ్రింక్ కూడా అలవాటైపోయింది. నేను ఆ అమ్మాయిని మరచిపోవడానికి ఒక ఐడియా ఇవ్వండి సార్..! ప్లీజ్..! – బాషా
పెరుగు ఫ్రిజ్‌లో నుంచి తీసి ఒక ఏడు రోజుల పాటు బయటపెట్టు! ‘వాట్ హ్యాపెండ్ టు యు సార్..???’ ఏంటి నీలాంబరీ అంతగా షాక్ తిన్నావ్??? ‘పెరుగు తీసి బయటపెట్టడం ఏంటి సార్???’ అప్పుడు బాషా పెరుగుతాడు!! ‘అబ్బా! ఈ తిక్క నేను భరించలేను సార్!’ అర్థం కాలేదా నీలూ?? ‘ఏంటి సార్ అర్థమయ్యేది? బాషా ఏమో అమ్మాయిని మరచిపోవడానికి చిట్కా చెప్పమంటే...’ చిట్కానే చెబుతున్నా కదా?? ‘ఏంటి సార్... పెరుగు ఫ్రిజ్‌లోంచి తీసి బయట పెట్టడమా ?’ అవును నీలూ... పెరుగును ఏడు రోజుల పాటు బయటపెడితే... ‘ఆ.. పెడితే!?!?’ పుల్ల..ల్ల..ల్ల..ల్ల..గా అయిపోతుంది!
‘అప్పుడు?!?’ దాన్ని తాగాలి నీలూ!! ‘సార్.....! మీకు దండం పెడతా! యాక్.. బ్యాక్.. అయిపోతారు సార్ అంత పులిసిన పెరుగు తింటే...!?’ అమ్మాయి పెళ్లయిపోయింది. భయ్యా ప్రేమించాడు. అయినా అమ్మాయి పెళ్లి ఇంకెవరితోనో అయిపోయింది. భయ్యా ప్రేమ కమ్మనిది. ఫ్రిజ్‌లో ఉన్న పెరుగు లాంటిది..! ‘అర్థమయ్యింది సార్.. మీరు మేధావి సార్..!! ఆ ప్రేమ బాషా చల్లటి ఫ్రిజ్ లాంటి గుండెలో నుంచి బయటికి వెళ్లిపోయింది.
అలాంటి ప్రేమ పులిసిపోయిన పెరుగు లాంటిది. దాన్ని ఇంకా కావాలనుకోవడం పుల్లటి పెరుగు తాగాలనుకోవడమే..! వెంటనే పులిసిన ఆ ప్రేమను చెత్తలో పారెయ్యాలి.. జీవితానికి కొత్త ప్రేమను..’ తోడుగా తెచ్చుకోవాలి. ‘ఏది!! పెరుగు తోడేసుకోవడానికి తెచ్చుకున్న తోడు లాంటి ప్రేమను తెచ్చుకోవాలి. అంతే కానీ గతాన్ని గుర్తు చేసుకుని బాధ పడకూడదు.’ నువ్వు మేధావి నీలు..! పెరుగు నేనంటే.. కొత్త తోడు నువ్వు అన్నావు..! శభాష్!!
Comments
Please login to add a commentAdd a comment