
హాయ్ అన్నయ్యా..! నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తను నా మరదలు. ఇంట్లో మా పెళ్లి ఫిక్స్ చేశారు. ప్రాబ్లమ్ ఏంటంటే... ఆ అమ్మాయి నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడటంలేదు అని అడిగితే.. ‘‘నేనేమైనా పెళ్లి చేసుకోనని చెప్పానా?’’ అని ప్రశ్నిస్తోంది. ‘‘నేనింతే, నాతో మాట్లాడకు’’ అంటోంది. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమా? కాదా? ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – విజయ్
మౌనరాగం సినిమా చూడన్నా..! ‘ఎందుకు సార్??’ చూస్తే మౌనం ఎందుకో అర్థం అవుతుంది. ‘అదేదో మీరే చెప్పొచ్చు కాదా సార్?’ కుదరదు విజయ్ సినిమా చూడాల్సిందే.. ‘చూస్తే ఏమవుద్ది సార్???’ సినిమా చూసినట్టు అనిపిస్తుంది..! ‘సార్...! బుర్ర తినకండి.. అరటిపండు ఇస్తా అసలు విషయం చెప్పండి సార్??!’ మౌనంలో కసి ఉంటుంది, కోపం ఉంటుంది. అసహ్యం ఉంటుంది. చీదర ఉంటుంది. వాటన్నింటి వెనుక ఓ గౌరవంతో కూడిన ప్రేమ ఉంటుంది..!!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment