
హాయ్ అన్నయ్యా...! నేను బీటెక్ చదువుతున్నా. నా జూనియర్ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. నిజానికి నాకు ఈ లవ్వు గివ్వు అంటే ఇష్టం ఉండదు. కానీ ఒక అమ్మాయి మన దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు నో చెబితే బాగుండదని ఓకే చెప్పాను. నాకు ఎవరి మీద త్వరగా నమ్మకం రాదు. కానీ తనని బాగా నమ్మాను. మా ఇంట్లో కూడా తనని పరిచయం చేశాను. ఓకే అన్నారు. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలీదు, అవాయిడ్ చెయ్యడం మొదలు పెట్టింది. పిలిచినా పలకడం మానేసింది. తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. తన బిహేవియర్‌కి చాలా బాధపడుతున్నా. రోజూ ఏడుస్తున్నా. మా ఫ్రెండ్ సాయంతో అసలు ప్రాబ్లమ్ ఏంటో? నాతో ఎందుకు మాట్లాడటం లేదో తెలుసుకోవాలనుకున్నా. అనుకున్నట్లే మా ఫ్రెండ్ తనని అడిగాడట. ‘మీ ఫ్రెండ్‌కి నాకంటే ముందు ఇద్దరితో అఫైర్ ఉంది’ అని చెప్పిందట. మేం బాగా ఉన్న రోజుల్లో ‘ఎవరినైనా లవ్ చేశావా?’ అని తను నన్ను అడిగింది. అప్పుడే చెప్పాను ఆ విషయం. తనే అడిగి తెలుసుకుని, ఇప్పుడు అదే ప్రాబ్లమ్‌గా చూపిస్తోంది. నా వల్ల కావడం లేదన్నా. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – కృష్ణ
ఏందన్నా కాకపోవడం... లైఫ్‌లో ఇలాంటి ట్విస్ట్‌లు మామూలే.. ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి టర్న్స్ చూడాలో.. ఈ చిన్న జలక్‌కే మనం వీక్ అయిపోతే... ముందు ముందు ఇంకా ఎన్ని లవ్ స్టోరీలు చూడాలో.. అసలు స్టార్టింగ్‌లో నీకు లవ్వు గివ్వు లాంటివి పట్టవని చెప్పావుగా.. మరి అంతకు ముందే రెండు అఫైర్లు ఉన్నాయని అమ్మాయికి ఎందుకు చెప్పినట్టో... ‘ఏదో ఇంప్రెషన్ కొట్టడానికి చెప్పి ఉంటాడు సార్!’ అంతేనంటావా నీలాంబరీ? ‘లేక నిజంగానే అఫైర్లు ఉన్నాయేమో సార్?’ మరి రెండుసార్లు ఆరితేరినోడు.. మూడోసారి అమ్మాయి ఉతికితే ఆరడానికి కష్టమేమొచ్చుంటుంది నీలూ??? ‘సార్... ఇగో హర్ట్ అయ్యి ఉంటుంది సార్.
మొదటి ఇద్దరు అమ్మాయిలను కృష్ణే వదిలించుకుని ఉంటాడు. భూమి రౌండ్‌గా ఉన్నట్లే మనము చేసిన పెంట మనకు అంటక మానదు కదా సార్. అందుకే ఈ సారి అమ్మాయి వదిలించుకుందేమో సార్!’ అయితే అయ్యింది. కష్టం వచ్చినప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ పెయిన్‌ని ఎంజాయ్ చెయ్యడం నేర్చుకోవాలి. గుండె పిండేస్తున్నప్పుడు నవ్వడం నేర్చుకోవాలి. ఓన్లీ హెడ్‌బాత్ చేస్తున్నప్పుడే కన్నీళ్లు కార్చెయ్యాలి. ‘అవును సార్ మన కన్నీళ్లు ఎవరికీ కనబడకుండా డ్రైనేజ్‌లోకి వెళ్లిపోవాలి. ఫ్రెండ్స్ అంతా ‘‘అబ్బా.. కృష్ణ ఈజ్ సో బ్రేవ్’’ అని మెచ్చుకోవాలి’ అంతే కాదు, నవ్వుతూ ఉంటే.. కొత్త ప్రేమలు మళ్లీ చిగురిస్తాయి కూడా!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment