
న న్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా! నేను డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతున్నా! మీరు చాలా మందికి ఎన్నో మంచి సలహాలు ఇస్తారు. నాకు కూడా మీరే హెల్ప్ చేయండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని ప్రేమించాను. తను నాకు మరదలౌతుందని తెలిసి, సంవత్సరం క్రితమే ప్రపోజ్ చేశాను. అప్పుడు తను రిజెక్ట్ చేసింది.
కానీ, లాస్ట్ టు మంత్స్ బ్యాక్ ‘లవ్యూ టూ’ చెప్పింది. ‘నువ్వు లేకపోతే నేను ఉండలేన’ంటోంది. కానీ వాళ్ల అమ్మకి చెప్పలేకపోతోంది. వాళ్ల డాడీ తొమ్మిది నెలల క్రితమే చనిపోయారు. మా పేరెంట్స్‌కి చెబితే.. ‘వాళ్ల ఫ్యామిలీ ఒప్పుకుంటే పెళ్లి చేస్తా’మన్నారు. కానీ వాళ్ల అమ్మకి నాపై మంచి అభిప్రాయం లేదు. తనకి సంబంధాలు చూస్తున్నారు. మా పేరెంట్స్‌కి ప్రిస్టేజ్ ఎక్కువ. నేను ఏం చెయ్యాలో స్రై్టట్‌గా చెప్పండి ప్లీజ్! – సాయి
నీలాంబరి నేల మీద దొర్లుతోంది. కడుపు పట్టుకుని మరీ దొర్లుతోంది. ఒళ్లంతా వంకర టింకరగా తిప్పుతూ దొర్లుతోంది. ‘ఏమైంది నీలూ’ అని అడిగా...! దొర్లుతూ దొర్లుతూ నావైపు తిరిగింది! ముఖం అంతా ఎర్రగా కందిపోయి ఉంది! ముందే మంచి కలర్... ఇప్పుడు ఆపిల్ లాగా అయిపోయింది! ఏమైంది.. ఏమైంది.. అని కంగారుగా అడిగా.. కడుపు పట్టుకుని దొర్లుతోంది నన్ను చూసి గట్టిగా నవ్వింది!నా మీద అంతా నీలాంబరి తుంపరే! హేయ్.. వాట్ ఈజ్ దిస్? అని అడిగా... ‘ఎల్.ఓ.ఎల్.ఆర్.ఓ.ఎఫ్’ అని ఇంకోసారి తుంపర పేల్చింది! అంటే ఏంటి?
‘లాఫ్ ఔట్ లౌడ్ రోలింగ్ ఆన్ ది ఫ్లోర్’ అంటే...? ‘ఎవరయినా మంచి జోక్ వేస్తే... కడుపు పట్టుకుని దొర్లుతూ నవ్వమని’ ఏంటి జోక్.. ఎవరు? పేల్చింది. ‘సార్ స్రై్టట్‌గా ఆన్సర్ చెప్పాలంట..! మీరు లైఫ్‌లో ఇప్పటిదాకా ఏదీ స్రై్టట్‌గా చెప్పలేదు. మీరు స్రై్టట్‌గా ఆన్సరిస్తే అంతకంటే పెద్ద జోక్ ఉండదు. ఎల్.ఓ.ఎల్.ఆర్.ఓ.ఎఫ్’ అని దొర్లుతూ నవ్వింది నీలాంబరి. ఇదిగో స్రై్టట్‌గా చెప్తున్నా ఆన్సర్. చూడు సాయీ.. నాన్న చనిపోయాడు.
ఆ కుటుంబానికి అమ్మే ఎవ్రిథింగ్! వరసకు నీకు అత్తయ్య! నువ్వంటే ఆమెకు మంచి ఇంప్రెషన్ లేదు! తండ్రి లేని బిడ్డను ఎలా చూసుకుంటావో అని డౌట్! అందుకే, నీకు అందకుండా చెట్టు ఎక్కి కూర్చుంది! మీ పేరెంట్స్‌కి ఇగో, అందుకే, వాళ్లు మిద్దెక్కి కూర్చున్నారు! వాళ్లని కన్విన్స్ చేసుకోకపోతే నీ లవ్ కొండెక్కినట్టే! ‘సార్ స్రై్టట్‌గా ఆన్సర్ చెప్పాలంటా...! లాఫ్ ఔట్ లౌడ్ రోలింగ్ ఆన్ ది ఫ్లోర్...’ అని కొండమీద నుంచి దొర్లినట్టు దొర్లుతూనే ఉంది నీలాంబరి!