
హాయ్ సార్..! ఒక అమ్మాయి నాకు ఫేస్ బుక్‌లో పరిచయమైంది. దానిలోనే నన్ను చూసి, డైరెక్ట్‌గా చూడకుండానే లవ్ చేసింది. తనని నేను కొన్ని రోజుల తర్వాత కలిశాను. కానీ, నేను తను ఊహించినంత బాగోలేదట. అలా అని నా ప్రేమను వదులుకోలేను అంటోంది. ‘‘నీ ప్రేమ మీద నాకు గౌరవం ఉంది’’ అంటోంది. బట్ తను ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయంత నన్ను లవ్ చెయ్యలేకపోతుందట. నాకు ఏం అర్థం కావటం లేదు సార్. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – అక్షయ్
‘సూపర్ అక్షయ్.. లవ్ డాక్టర్ దొరికిపోయారు. నీ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇవ్వడం... లవ్ డాక్టర్‌కే కాదు.. ఎవరి జేజమ్మకు కూడా కుదరదు. అసలు ఏం క్వశ్చన్ అక్షయ్.. ఇప్పటికి టెన్ టైమ్స్ చదివినా అర్థకాలేదు లవ్ డాక్టర్‌కి. ఏం చెయ్యాలో అర్థంకాక పచ్చి అరటికాయలు తినేస్తున్నారు. అవునూ.. నాకొక డౌట్!?! అమ్మాయికి నువ్వు నచ్చలేదు కానీ ప్రేమిస్తుంది.
ప్రేమిస్తుంది కానీ ఫస్ట్ అబ్బాయిని నీకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నిన్ను లైన్లో పెట్టి ఫస్ట్ అబ్బాయిని వదులుకోకుండా ప్రేమిస్తుంది. ‘‘ఐయాం ఇన్ ద క్యూ’’ అని లైన్లో వేలాడుతున్నావు. అమ్మాయి లైన్ ఎప్పుడు డిస్‌కనెక్ట్ చేస్తుందోనని టెన్షన్‌లో లవ్ డాక్టర్‌కి అడ్వైజ్ కోసం రాశావు. అంతే కదా!! అయితే ఆగు, ఈ విషయం అంతా మీసాలాయనకు చెప్పి ఆయన అడ్వైజ్ నీకు కనెక్ట్ చేస్తా...
.....సార్! విషయం అంతా విన్నారు కదా, మరి ఏమంటారు? అక్షయ్ లవ్ కాయా? పండా సార్????’ ‘అక్షయ్ నేను అడిగిన ప్రశ్నకు సారూ ఇంకో కాయ నోట్లోకి కుక్కుకున్నారు. అంటే... అంటే....! నీ లవ్వు పండు కాదు కాయేనన్నమాట!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment