హాయ్ సార్..! నాకో పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య బతికుండగానే నాకు నరకం చూపిస్తోంది. దయచేసి నన్నూ నా ప్రేమనూ మీరే కాపాడాలి. నేనొక అమ్మాయికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మూడేళ్ల క్రితం నాకు ప్రపోజ్ చేసింది. అప్పటి నుంచి నాకు రోజూ ఫోన్ చేసేది. నేను మాట్లాడకపోతే చచ్చిపోతా అనేది. ‘‘ఏ క్షణమైతే నా నుంచి దూరమవుతావో ఆ క్షణమే నేను ప్రాణాలతో ఉండను’’ అనేది. తనకు ఫోన్ లేకుంటే కొనిచ్చాను. ఇదిలా ఉండగా నా ఫ్రెండ్ తన గురించి ఓ విషయం చెప్పాడు. ‘‘తనకి ఇంతకు ముందే ఒక లవర్ ఉండేవాడని. వాడితో ఇప్పటికీ ఫోన్‌లో మాట్లాడుతోంది’’ అని. నేను నమ్మలేదు. గమనిస్తే నిజమని తేలింది. దాంతో తనని ఒంటరిగా బయటికి వెళ్లొద్దని చెప్పాను. గొడవ పడ్డాను. చాలా కోపగించాను. ఆ మరుసటి రోజే నాకు ఫోన్ చేసి.. ‘‘సెల్ చార్జింగ్ లేదు, నా ఫ్రెండ్‌తో బ్యాటరీ పంపించు’ అంది. నేను కాస్త కోపంలో ఉండి పంపించలేదు. వారం రోజులు ఫోన్ చెయ్యడం మానేసింది. నిజంగానే చార్జింగ్ లేదేమోనని ఫ్రెండ్‌తో బ్యాటరీ పంపించాను. అయినా ఫోన్ రాలేదు. ఏమైందని తన ఫ్రెండ్‌ని అడిగితే తెలియదంటోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్..! – అభిమాని
నీవు లేక వీణ పలకలేనన్నది... నువ్వు లేక రాధ నిలువలేనన్నది...‘సార్...............................!!’ ఏమైంది నీలూ అంత గట్టిగా కేక వేశావు??? ‘లవ్ డాక్టర్‌కి లెటర్ రాస్తే డాక్టర్ చక్రవర్తి సినిమాలో పాట పాడతారేంటి సార్???????’ చూడు నీలూ నీ ‘అభిమాని’ ఒక్క క్షణం కూడా..... మాట్లాడకపోతే ఉండలేనన్నది... నువ్వు లేకపోతే లైఫ్ నడపలేనన్నది... నిన్ను చూడకపోతే ఐస్ ఓపెన్ చెయ్యలేనన్నది... ఫోన్ కొనివ్వకపోతే ‘టాక్’లేనన్నది.... సెకండ్ ఫ్రెండ్ లేకపోతే నీ విలువ తెలుసుకోలేనన్నది... వీడు లేని వీణా పలుకలేనన్నది...
బ్యాటరీ లేక రాధ నిలువలేనన్నది... ఆ...ఆ...ఆ...ఆ...ఆ................ ‘అర్థమయ్యింది సార్..! అన్ని చెప్పిన అమ్మాయి వన్ వీక్ ‘టాక్’కుండా ఉందంటే మనోడికి బాగానే బటర్ పూసిందన్నమాట. ‘అభిమాని’ ఇంకొకరి ‘అభిమాని’ అయితే బెటర్ దెన్ దిస్ బటర్ అంటున్నారు కదా సార్?’ అబ్బబ్బబ్బబ్బా... నీలూ నువ్వు చాలా స్మార్ట్!
- ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment