
హాయ్ సార్, నేను లవ్‌లో పడ్డాను. ఎలా మరిచిపోవాలి?? ఎలా బయటికి రావాలి?? ఆ అమ్మాయిని చూస్తే చాలు నా లవ్ గుర్తుకొస్తుంది. ఎనీ టిప్స్ ప్లీజ్ సార్!! – చెన్న
నా మాట విని ఒక పని చెయ్యి చెన్నన్నా! ‘ఏంటి సార్ అంత స్పీడ్‌గా రాస్తున్నారు?’ పాపం చెన్నా టెన్షన్ పడుతున్నాడు కదా నీలాంబరీ.. అందుకని... ‘అందుకేనా సారూ...?’ ఎందుకీ వెటకారం? ‘ఎవరయినా అబ్బాయిలు.. లవ్లో నుంచి పడేయమంటే మీ ముఖం వెలిగిపోతుంటుంది సారూ..’ అవునా? ‘సార్.. జిలాగా ఉంటే ఏం చేస్తాము సారూ.. అజ్జెంజెంట్గా గీరుకుంటాము కదా సార్?’ ఇప్పుడు జిల ఎక్కడ నుంచి వచ్చింది నీలూ? ‘సార్ రావక్కరలేదు సార్! మీకు ఎప్పుడూ ఉండే జిలే.. అబ్బాయిలను జీకే జిల సార్!’ సరే.. ఇప్పుడు చెన్నాకి ఆన్సర్ చెప్పాలా వద్దా?’
‘చెప్పండి సార్.. బిడ్డ అనవసరంగా మీ చేతుల్లో బుక్ అయిపోయాడు!’ చెన్నా అన్నా.. పక్కన ఫ్రెండ్‌ని ఎప్పుడూ పెట్టుకో.. వాడికో బైనాక్యులర్స్.. ఒక నల్ల తువాలు.. ఇప్పించు... ‘బైనాక్యులర్స్ ఎందుకు.. తువాలు ఎందుకు సార్??’ అదిగో నువ్వు మధ్యలో కౌంటర్లు వెయ్యకుండా ఉంటే చెబుతా.. అల్లంత దూరంలో అమ్మాయి కనబడగాన్నే నీ కళ్లకు నల్ల తువాలు గట్టిగా కట్టెయ్యమను..‘ఏంటి సార్ ఈ ఫజిల్??’ అమ్మాయి కనబడితే లవ్ గుర్తుకొస్తుంది కదా.. అమ్మాయి కనబడకుండా చేసుకుంటే.. గుర్తు రాదుకదా?? ‘వేస్ట్ చెన్నా.. ఈయనకి మరిచిపోయే సొల్యూషన్ కోసం రాయడం వేస్ట్.. నేను ముందే చెప్పా బుక్ అయిపోతావని’ అని నవ్వింది నీలు!
– ప్రియదర్శిని రామ్
Comments
Please login to add a commentAdd a comment