
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ రామ్ గారు, మేము ఒకరికొకరు 5 ఏళ్లుగా ఇష్టపడుతున్నాం. నాకు 23. అతనికి 27 ఏళ్లు. అతను బిజినెస్ చేస్తున్నాడు. చెప్పుకోదగ్గ ఆస్తి లేకున్నా, నన్ను హ్యాపీగా చూసుకోగలిగినంత సంపాదిస్తున్నాడు. నేను జాబ్ చేస్తున్నాను. మా పేరెంట్స్ నాకు బాగా ఆస్తి ఉన్న అబ్బాయిని ఇచ్చి చెయ్యాలనుకుంటున్నారు. అతని పేరెంట్స్‌కి మేము పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ ఇంకా టైం పడుతుంది అంటే సహించలేకపోతున్నారు. మావాళ్లు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. జాబ్ కూడా మాన్పించేశారు. నేను నా ప్రేమ గురించి మాట్లాడితే మా అమ్మకి హెల్త్ డిస్ట్రబ్ అవుతుంది. ఎదిరించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్లు చెప్పినట్టు వేరే పెళ్లి చేసుకుని ప్రేమిస్తున్న అతన్ని మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. అతనికి దూరంగా ఉండలేకపోతున్నాను. సలహా ఇవ్వగలరు ప్లీజ్... – మాధవి
మాధవి బంగారం.
‘సార్... ఒక్కసారయినా అబ్బాయిలను బంగారం.. కన్నా.. నాన్నా అని పిలిచారా సార్..’ బంగారాన్ని బంగారం అని పిలుస్తా. దొంగవాణ్ణి దొంగ అని పిలుస్తా. ‘అంటే అబ్బాయిలంతా దొంగలా సార్.. దిస్ ఈస్ ఆబ్సల్యూట్లీ అన్ ఫెయిర్ సార్.. దొంగ ఏంటి సార్ దొంగ?!! హౌ డేర్ యూ సార్..’ దొంగతనం చేస్తే దొంగ అనకపోతే బంగారం అని పిలవాలా? నా చెల్లెలు మాధవి బంగారం... వాడు దొంగారం ఇదే ఫైనల్.
‘ఏమి దొంగిలించాడు సార్... మీ ఆస్తా.. మీ బావమరిది ఆస్తా? సార్!’ మధ్యలో నా బావమరిదిని తీసుకురాకు.. ‘అమ్మాయి హెల్ప్ అడిగితే మధ్యలో అబ్బాయిని తేకండి సార్’ ఓకే ‘ఓకే’ ఓకే ‘సార్.. దొంగ ఎందుకు అన్నారు సార్?’అమ్మాయి మనసు దొంగిలించాడు కదా ‘ఓహ్... హౌ స్వీట్ సార్’ అలాగే అమ్మాయి పేరెంట్స్ మనస్సు కూడా కబ్జా చేసుకోమంటా. ‘అప్పుడు బంగారం అని పిలుస్తారా సార్ అబ్బాయిని!’ గజదొంగ అంటా... ఎనీ డౌట్?‘ఇదిగోండి అరటిపండు వితౌట్ డౌట్