
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా... నేను ఒక అబ్బాయిని ఐదేళ్లుగా ఇష్టపడుతున్నా.
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా... నేను ఒక అబ్బాయిని ఐదేళ్లుగా ఇష్టపడుతున్నా. తనే నాకు ప్రపోజ్ చేశాడు. తనకు నేనంటే ఇష్టమే కానీ తనని నమ్మాలంటే భయమేస్తోంది. నాతో ప్రేమగా ఉంటునే... వేరే అమ్మాయితో బ్యాడ్‌గా మెసేజ్‌లు చేశాడు. ఏంటని నిలదీస్తే... ‘తను మెసేజ్ చేసింది అందుకే నేనూ చేశాను’ అన్నాడు. చాలా బాధగా అనిపించి చాలా రోజులు మాట్లాడలేదు. తనే నా దగ్గరకి వచ్చి ‘ఇంకోసారి ఇలా చేయను, నువ్వే నాకు ఇంపార్టెంట్’ అని చెప్పాడు.
మారతానన్నాడు కదా అని మాట్లాడం మొదలుపెట్టాను. కానీ చాలా భయమేస్తోంది లైఫ్ అంటే. నేను ఏమైనా అంటే కొడతాడు. కోపమొస్తే గోల్డ్ చైన్, ఫోన్ లాక్కెళ్లిపోతాడు. తనంటే చాలా ఇష్టమున్నా నా పేరెంట్స్‌కి ఏం చెప్పి ఒప్పించగలను? నాకంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపించింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు సలహా ఇవ్వండి. – మౌనిక
మౌనిక అరటిపండు తిని ఎన్ని రోజులు అయ్యిందో..?‘సార్.. అబ్బాయి – అమ్మాయి మధ్యలో అరటిపండు ఏంటి సార్?’అదే అరటిపండు వలిచి పెడదామని...!‘ఓహ్.. అంత క్లియర్‌గా ఉన్నా అమ్మాయికి అర్థం కావడంలేదు అంటున్నారా?’నువ్వే... నా చెల్లెలికి వలిచి చెప్పు నీలాంబరి!!‘అబ్బాయి శుద్ధ దండుగ! అస్సలు చాన్స్ ఇవ్వొద్దు!!
వాడిలో సెర్చ్ లైట్ వేసి వెతికినా ఎక్కడా అభిమానం కనబడటం లేదు. క్యాండిల్ లైట్లో కూడా ఒళ్లంతా డర్టీ ఫెలో – ఏ కనబడుతున్నాడు. ఇక లైట్ హౌస్.. అదే సముద్రం దగ్గర పొడుగ్గా వుంటుంది దాంట్లో పెద్ద లైట్ ఉంటుంది చూడండి... ఆ లైట్‌తో ఫోకస్ చేసినా అబ్బాయిలో ఒక్క చుక్క లవ్ కనబడటం లేదు.’అర్థమయిందా చెల్లెమ్మా... తొందరగా అబౌట్ టర్న్ కొట్టి లైఫ్‌ని కాపాడుకో...!అరటిపండ్లు తింటూ ఉండమని చెప్పండి సార్... లవ్‌లో ఉన్న మోసాలను ఇట్టే కనిపెట్టెయ్యొచ్చు’ అని నవ్వింది నీలాంబరి!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్