హాయ్.. రామ్ అన్నయ్యా..! నేను నాలుగేళ్లుగా ఒకే బాధను మోస్తున్నా. నావల్ల కావట్లేదు. నాలుగేళ్ల క్రితం ఒక అమ్మాయి ‘ప్రేమిస్తున్నా’ అంటూ ప్రపోజ్ చేసింది. మొదట్లో లైట్ తీసుకున్నా. కానీ ‘నువ్వు లేకుండా నేను బతకలేన’ంది. నమ్మాను. తిరిగి ప్రేమించడం మొదలుపెట్టాను. ఉన్నట్టుండి, మాట్లాడటం మానేసింది. ఫోన్ నంబర్ బ్లాక్ చేసేసింది. తను నాతో మాట్లాడక నాలుగేళ్లు అవుతోందన్నయ్యా. ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు, మంచి జాబ్.. అన్నీ ఉన్నాయి. కానీ సంతోషంగా ఉండలేకపోతున్నా. నిత్యం మనసు తననే కోరుకుంటోంది. తను ఒక్కసారి నాతో మాట్లాడితే చాలనిపిస్తోంది. ఎప్పుడూ ఏదో కోల్పోతున్నానన్న బాధ నన్ను వెంటాడుతోంది. నేను పిచ్చోడినైపోతున్నా అన్నయ్యా. ఏం చేస్తే నా బాధ తగ్గుతుందో చెప్పండి ప్లీజ్. – తమ్ముడు మనోజ్
అబ్బా.. మనసు కలచివేస్తోంది కదూ!! ‘ఏంటి సార్?? తమ్ముడు అని రాశాడు కాబట్టి.. పాజిటివ్‌గా స్టార్ట్ చేశారా సార్ ఆన్సర్???’ నిజంగా నీలాంబరి.. ఆ బాధ భరించలేనిది! ‘మీకెలా తెలుసు సార్.. ఆ..ఆ..ఆ... బాధ??????’ తమ్ముడు బాధ అన్నయ్యకు తెలియదా నీలూ? ‘సార్ ఇలాంటి బాధ ఫస్ట్ హ్యాన్డ్‌లోనే తెలుస్తుంది.’ ఏం లేదు. నాకు ఆ.. ఆ... ఆ.. బాధ తెలుసు! ‘ఎలా సార్? మీకు కూడా అమ్మాయి బిస్కెట్ వేసిందా సార్???’ బిస్కెట్, చాక్లేట్ వెయ్యడానికి నేనేమైనా.. నీలాగ బ్యూటీ కాదు.. నీలాగ స్మార్ట్ కాదు. నీలాగ యాక్టివ్ కాదు.. నీలాగ యంగ్ కూడా కాదు నీలూ! ‘సార్... నాకు తెలుసు, మీకేదో బిస్కెట్ పడింది.
సరే ఆ విషయం తర్వాత మాట్లాడదాం కానీ ముందు మీ తమ్ముడికి మందు పుయ్యండి సార్!’ అమ్మో.. నీ బాధ భరించలేనిది. గుండెలో సువ్వలు దిగినట్టు అనిపిస్తుంది. ప్రాణం గుంజేస్తుంది. ఏదో ఒకలాంటి దడ బాడీ అంతా పట్టేస్తుంది. ఏ తప్పు చేయకుండా శిక్షపడటమంటే ఇదేనా అనిపిస్తుంది. ఎప్పుడూ ఒక రకమైన ఎమ్టీనెస్ అనిపిస్తుంది. ఒక్కసారి ఫోన్ మోగదా? ఒక్కసారి ప్రేయసి పలకదా? మళ్లీ నన్ను ఎట్‌లీస్ట్ ఫ్రెండ్‌గానైనా యాక్సెప్ట్ చెయ్యదా? అన్న ఆశతో బతికేస్తుంటాం.
‘మరి సొల్యూషన్ ఏంటి సార్?’ ఈ బాధను బాధతోనే కడిగేయాలన్నది నా సమాధానం. వేరే ఏదీ ఈ బాధను తగ్గించలేదు. బాధను ప్రేమించాలి. ఆ తర్వాత అది తగ్గిపోతుంది. ‘అలా అవుతుందా సార్?’ అవుతుంది..! బలం, నిబ్బరం ఉన్న మగాడైతే.. తప్పకుండా ఈ బాధను అనుభవించి మరీ నమిలి పారెయ్యాలి..! హి కెన్ డు ఇట్!! ‘అవును. బాధ తీయ్యగా ఉంటుంది. దాన్నుంచి పారిపోవద్దు. మెల్లగా అదే తగ్గిపోతుంది. బి బ్రేవ్ మనోజ్!’
- ప్రియదర్శిని రామ్
Comments
Please login to add a commentAdd a comment