
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తోంది. కానీ వాళ్ల ఇంట్లో ఒప్పుకోవడం లేదు! మా పేరెంట్స్ అయితే.. ‘వాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోండి! లేదంటే వద్దు!!’ అంటున్నారు. నాకు వాళ్ల ఇంటికి వెళ్లి అడిగే ధైర్యం లేదు. ఆ అమ్మాయి చెబితే వాళ్లు వినడంలేదు. సో ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారో చెప్పండి సార్ ప్లీజ్! – హరీష్
నీలాంబరీ! వెంటనే మార్కెట్‌కి వెళ్లి రా. ‘ఎందుకు సార్?!?’ అర్జెంట్‌గా వెళ్లు! ‘అర్ కైకూ.. జానా.. మార్కెట్‌కు..’ ఎహే?!? ‘అదే సార్ హిందీలో అడుగుతున్నా మార్కెట్‌కు ఎందుకు వెళ్లాలని?’ వై హిందీ..? ‘హైదరాబాద్ మార్కెట్‌లో హిందీ ఎక్కువ సార్...’ఓకే.. వెంటనే మార్కెట్‌కి వెళ్లు...! ‘ఏమి తేవడానికి అని అడుగుతున్నా..’ నేను చెబుతా కదా నువ్వు బయలుదేరు! ‘ఫోన్‌లో చెబుతారా సార్..!’
ఎస్! ‘ఇప్పుడు చెప్పరా?’ నో ‘వై..?’ అది అంతే... ‘ఇప్పుడు చెబితే ఏమవుతుంది..?’ ఇప్పుడు.. ఇక్కడ.. చెబితే నువ్వు నమ్మవు! ‘మైండ్ బ్లాక్ అయ్యిందా సార్.. తొక్క మీద కాలేశారా సార్.. కరెక్ట్‌గా చెప్పండి!’ సరే చెబుతా విను! ‘నేనక్కడికి వెళ్లి ఏం తేవాలి... చెప్పండి’ మార్కెట్‌కి వెళ్లి ఒక కిలో ధైర్యం తీసుకురా!‘సార్..!?!’ హరీష్ వాళ్ల ఇంట్లో ధైర్యం అయిపోయిందట!! ‘అయితే మార్కెట్‌లో దొరుకుద్దా సార్? ధైర్యం??’ ఆ ముక్క హరీష్‌కి చెప్పు.. ఎక్కడయితే ప్రేమ కలుగుతుందో.. ధైర్యం కూడా అక్కడే దొరుకుతుంది!
– ప్రియదర్శిని రామ్
లవ్ డాక్టర్