
హాయ్ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని చాలా బాగా ప్రేమించాను. అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. వన్ ఇయర్ చాలా బాగున్నాం. ఉన్నట్టుండి తను నాతో మాట్లాడటం లేదు. నేను మాట్లాడదామని వెళ్లినా ముఖం తిప్పుకుంటోంది. ఆల్ రెడీ టూ ఇయర్స్ గడిచిపోయాయి. కానీ నా మనసు తననే ఇష్టపడుతుంది. అన్నయ్యా మంచి సలహా ఇవ్వండి ప్లీజ్! – ఆర్యన్
అయ్యో.. ఎంత బాధ అన్నా నీకు..? ఇన్నాళ్లు ప్రేమించి సడన్‌గా యు టర్న్ కొట్టింది..! నువ్వు లెఫ్ట్‌లో కనబడితే.. రైట్‌కి ముఖం తిప్పుకుంటుంది..! ‘నువ్వు రైట్‌లో కనబడితే లెఫ్ట్‌కి ముఖం తిప్పుకుంటుంది... ఏంటి సార్...? అక్కడ ఆర్యన్ గుండె పట్టుకుని విలవిలాడిపోతుంటే.. మీరు అంత క్యాజువల్‌గా... ఏదో గార్డెన్‌లో నడుస్తూ పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టు... ‘‘ఓ.. ఓహో..’’ అన్న ధోరణిలో మాట్లాడుతుంటే ఏం కావాలి సార్ లవ్..? మీరు ఇదే ఫ్లోలో మాట్లాడితే.. మీ కంచంలో అరటిపండు పెట్టే లవ్ మిమ్మల్ని వదిలి ఇంకో కంచం చూసుకుంటుంది సార్..!’ ఏంటి నీలూ నువ్వేమైనా వదిలిపోతున్నావా!?!
‘సార్ నేనేమైనా ఆర్యన్ గర్ల్ ఫ్రెండ్‌నా సార్..?! వదిలిపోవడానికీ.. వదిలేసుకోవడానికీ..? ప్రేమ బాసలను తోసెయ్యడానికీ.. లవ్ ఫీలింగ్‌ని దులిపేసుకోవడానికీ.. ఐ యామ్ ఏ గుడ్ లవర్ సార్..! నాకు ప్రేమే ఊపిరి సార్..!! ఆర్యన్ లాంటి బాయ్ ఫ్రెండ్ నాకూ దొరికితే.....’ దొరికితే... నన్ను వదిలేసి పోతావా నీలూ..!!?!! ‘సార్ సెంట్‌మెంట్‌తో కొట్టకండి సార్.. వెళ్లిపోయేదాన్నయితే ఉండిపోయేదాన్నా సార్???’ అబ్బా ఏం కవిత్వం నీలూ..!! వెళ్లిపోయేదాన్నైతే ఉండిపోయేదాన్నా.. అద్భుతం..!! ‘భూతం లేదు..! దెయ్యం లేదు..!! నాకు బటర్ రాసే బదులు ఆర్యన్‌కి ఆయింట్‌మెంట్ రాస్తే అరటిపండు దొరుకుద్ది!!’
ఆర్యన్.. అరే... లవ్ అంటేనే మజా.. రిస్క్.. తెగింపు..! దొరుకుద్దని ప్రేమిస్తే అది ప్రేమే కాదు..! ప్రేమిస్తే అదే దొరుకుద్ది..!! అంతకంటే గొప్ప ప్రేమ దొరుకుద్ది..!! ఒక లవ్ స్టేషన్‌లో దిగి ఊరు నచ్చకపోతే.. మళ్లీ ట్రెయిన్ ఎక్కెయ్యాలి..! జిందగీ ఒక్కసారే దొరుకుద్ది! ప్రేమ వంద సార్లు...!! ‘సార్ పోయెట్రీ మీది సార్..! ఇంద ఇంద తీసుకో! అరటిపండు సొంతం చేసుకో...!!’
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment