
హాయ్ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. తనూ నన్ను ప్రేమిస్తోంది. కానీ, కొన్ని రోజుల క్రితం ‘‘ఇదంతా వద్దురా! ఫ్రెండ్స్‌లా ఉందాం!! సెటిల్ అయ్యాకా చేసుకుందాం!!’’ అంది. నేను ఓకే అన్నాను కానీ, ఈ మధ్య తన ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది. తను నన్ను వదిలేస్తుందేమో అని భయంగా ఉందన్నయ్యా. ఏం చెయ్యమంటారు..?? తనంటే నాకు ప్రాణం. ఏదైనా మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – మనోహర్ బాబు
ప్రేమ అంటేనే ప్రాణం! ప్రేమించిన అమ్మాయి మారిపోతుందేమో అన్నది చాలా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. లైఫ్ అంతా పెంటపెంటగా అనిపిస్తుంది! కూర్చున్న చోటున కూర్చోనివ్వదు! పడుకుంటే నిద్ర రాదు! అన్నం సహించదు! ఎప్పుడూ.. ఫ్యూచర్ ఏమవుతుందోనన్న భయం పట్టుకుంటుంది...! హైబత్ హైబత్ అనిపిస్తుంది..! ‘హైబత్ హైబత్ అంటే ఏంటి సార్!?!’anxiety ‘తెలుగులో చెబుతారా సార్?’ గుండె దడగా అనిపిస్తుంది! ‘ఓహో.. అలాగా... మరి ఇప్పుడు మనోహర్ ఏం చెయ్యాలి సార్?’ డౌట్స్ మానేసి.. అమ్మాయిని నమ్మాలి! ‘ఆ అమ్మాయి ఏదో తెడ్డు చూపించేలానే ఉంది సార్!’ ఎలా తెలుసు నీకు..? ‘ముందు లవ్‌లో ఉంది! తరువాత ఏందో... ఈ అబ్బాయితోనా లవ్!? అన్నట్లు అనిపిస్తోంది.
తనకు ఇంతకంటే మంచి మ్యాచ్ దొరుకుతుందనుకుందేమో అనిపిస్తోంది సార్!’ ఆపుతావా..! అక్కడ మనోహర్ హైబత్ హైబత్ అవుతాడు! ‘సార్ నిజం చెప్పుకోకపోతే ఎలా సార్?? అనవసరంగా హోప్స్ పెట్టుకుని కూర్చుంటే.. రేపు బై ఛాన్స్... ఆ అమ్మాయి హ్యాడ్ ఇస్తే నా ఫ్రెండ్ అనవసరంగా డిప్రెస్ అయిపోతాడు సార్!’ అవును! నిజమే...!! చాలా కష్టంగా అనిపిస్తుంది..! అలా అని... మన శక్తి మనం కోల్పోకూడదు! మనోహర్ షుడ్ బీ స్ట్రాంగ్. లైఫ్‌లో లవ్‌ని ఒక ప్రాసెస్‌గా యాక్సెప్ట్ చేసుకోవాలి.
లవ్‌ని మనం ఇవ్వాలి. అమ్మాయి ఏ కారణం వల్లైనా ప్రేమ రిటర్న్ చెయ్యకపోతే.. మనోహర్ కంటే తానే ఎక్కువ నష్టపోతుంది. ‘ఎలా నష్టపోతుంది సార్?’ ప్రాణంలా చూసుకునే మనోహర్... వరల్డ్ అంతా వెతికినా దొరకడు! ‘అవును సార్ ఇలాంటి ప్రేమికుడు చాలా రేర్... మనోహర్ స్ట్రాంగ్‌గా ఉండాలి.. ఇచ్చిన ప్రేమ... పుచ్చుకునే ప్రేమ కంటే గొప్పదని తెలుసుకోవాలి.’
Comments
Please login to add a commentAdd a comment