
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ లవ్ గురూ!! నేను త్రీ ఇయర్స్‌గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా.
లవ్ డాక్టర్
హాయ్ లవ్ గురూ!! నేను త్రీ ఇయర్స్‌గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయి కూడా నువ్వంటే నాకూ ఇష్టమే అని చెప్పింది. ఫోన్‌లు, మెసేజ్‌లు, షికార్లు అంటూ బాగానే ఉండేవాళ్లం! కానీ, ఈ మధ్య తనకి ఏమైదో ఏమో... ‘ఇవన్నీ వద్దురా... ఆపేద్దాం!’ అంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సలహా ఇవ్వండి ప్లీజ్!! – సాయి
ఆపెయ్యరా..! ‘సార్.. మీ మనసు మట్టి ముద్దా!?!’ వద్దురా...! ‘సార్ ఛీ... అసలు మీకు మగాళ్లు ఉత్తరాలు రాయడమే వేస్ట్ సార్...!’
ఇవన్నీ ఆపేయరా! ప్లీజ్...!! ‘సార్.. ఏంటి సార్ మీ ప్రాబ్లమ్.. మీకు లవ్ అర్థం కాదా..!?! సార్... అన్యాయం సార్..!’ ఇవన్నీ ఆపేయరా... వద్దురా...! ‘సార్ అమ్మాయి అలా ఎందుకు అంటోంది అని అడుగుతున్నాడు సార్..’ వద్దురా ఆపేయరా...! ‘సార్ ముందు ప్రేమించింది. ఫోన్లు, మెసేజ్‌లు, షికార్లు, బాసలు, కాసులు అన్నీ ఖర్చయ్యాకా వద్దురా! గిద్దురా!! ఆపేద్దాం! గీపేద్దాం!! అంటే ఎలా సార్..? పాపం సాయి... క్యా కర్నా.. గిలగిల కొట్టుకుంటున్నాడు సార్.. మంచి అడ్వయిజ్ ఇస్తే మంచి అరటిపండు ఇస్తా సార్!’
ఏదో తేడా కొట్టింది. అమ్మాయికి క్లారిటీ వచ్చింది. కారణం ఏదయినా ఈ రిలేషన్‌షిప్ మంచిది కాదని అనుకుంది. తానే కాదు.. సాయి కూడా ఫ్యూచర్‌లో హర్ట్ అవుతాడని క్లారిటీ వచ్చి... చాలా ప్రేమగా వద్దురా.. ఇవన్నీ ఆపేద్దామని చెప్పింది! ఊరికే ఫీల్ అవకుండా త్రీ ఇయర్స్ లవ్‌ని లైఫ్ లాంగ్ గుండెల్లో ఉంచుకుని, అప్పుడప్పుడు బయటికి తీసి చూసుకొని సంతోషించాలి కానీ, ఎక్కువ ఫీల్ అయితే హర్ట్ అవుతాడు!! ‘మీ చెల్లెలు వేస్ట్ సార్.. మీకు అరటిపండు వేస్ట్ సార్!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com