
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ప్రపోజ్ చెయ్యాలంటే భయమేస్తోంది. అయితే ఆ అమ్మాయినే నా ఫ్రెండ్ కూడా లవ్ చేస్తున్నాడు. కానీ వాడి కంటే ముందు నుంచి నేను లవ్ చేస్తున్నాను. వాడు మాత్రం ఏదో టైమ్ పాస్‌కి లవ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్‌కి చెప్పాలంటే ఎలా రియాక్ట్ అవుతాడో అని టెన్షన్‌గా ఉంది. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్. వాడికోసం ఆ అమ్మాయిని మరచిపోదాం అనుకున్నాను.. కానీ మరచిపోలేకపోతున్నాను. ఆ అమ్మాయి కంటే నాకు నా ఫ్రెండే ఎక్కువ. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ సలహా ఇవ్వండి. – సాయి బాబు
ఒక మంచి ఫ్రెండ్‌గా ఉండు!! ‘మరి లవ్ సార్?’ మంచి ఫ్రెండ్‌గా ఉండటం బెటర్! ‘ఫ్రెండ్‌షిప్ కంటే లవ్ గొప్పది కదా సార్?’ మంచి ఫ్రెండ్‌గా ఉండటం బెటర్ కంటే బెస్ట్ ‘మీరు శాడిస్ట్ సార్!’ కానీ మంచి ఫ్రెండ్‌ని! ‘ఏంటి సార్ మీ ధోరణి.. ఎండ దెబ్బ ఏమైనా కొట్టిందా సార్?’ లవ్ ఎండలాంటిది. మంచి వేడిగా ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ వెన్నెల లాంటిది. చల్లగా ఉంటుంది.
‘సార్.. సాయి బాబు ఈ హాట్ ఎండకు కోల్డ్ ట్రీట్‌మెంట్‌తో పిచ్చోడైపోతాడు సార్!’ ప్రేమ ఒక పిచ్చి.. ఫ్రెండ్‌షిప్ వెరీ సచ్చి! ‘సచ్చి అంటే.. సచ్చినోడులో ‘సచ్చి’నా సార్???’ సచ్చి అంటే హిందీలో ట్రూ.. నిజమైనది. స్వచ్ఛమైనది.. క్లీన్...! ‘సాయీ! మంచి ఫ్రెండ్‌గా ఉండిపో.. మిగిలిపో.. చరిత్రకు ఎక్కు!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment