హాయ్ రామ్ అన్నయ్యా..! నా క్లాస్‌మేట్ నాకు ప్రపోజ్ చేశాడు. తన మంచితనం నచ్చి నేనూ ఓకే చెప్పాను. ఆ తర్వాత నాకు కష్టంగా అనిపించి బ్రేకప్ అనేశాను. ఆ గ్యాప్‌లో నాకో ఫ్రెండ్ పరిచయమయ్యాడు. అది కాస్త లవ్‌గా మారింది. కొన్ని రోజులకి అసలు ఇలా చెయ్యడం చాలా తప్పనిపించి, ఫస్ట్ అబ్బాయి దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. ‘సరే, ఇంకోసారి ఇలా చెయ్యకు’ అన్నాడు. అయితే ఇప్పుడు ఇద్దరూ నేనే కావాలంటున్నారు. భయంతో ఇద్దరికీ ఏం చెప్పలేదు. ఇదిలా ఉండగా.. నా బావ నన్ను లవ్ చేస్తున్నాడట. ‘ఇదంతా జరగని పని, వదిలేసెయ్’ అని చెప్పాను. బట్.. తను మాత్రం ‘నేను వెయిట్ చేస్తా, నిన్నే పెళ్లి చేసుకుంటా’ అంటున్నాడు. ఈ ముగ్గురూ నన్ను డీప్‌గా లవ్ చేస్తున్నారు. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉందన్నయ్యా. వాళ్లతో పాటు మా అమ్మా వాళ్లని కూడా మోసం చేశాను. ఇంక ఈ బాధను నేను భరించలేను. నాకో మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – భాను
ముగ్గుర్నీ మీటింగ్‌కి పిలువు. ముగ్గురికీ బుద్ధి పెట్టు. ‘మనం ఒక గెల అరటిపండ్లు తిని, తొక్కలు పంపుదాం సార్!’ అరటిపండ్ల తొక్కలెందుకు నీలూ??? ‘బుద్ధితో పాటు గడ్డి కూడా పెట్టాలి కదా సార్!’ అని నవ్వింది నీలూ. మీటింగ్‌కి పిలిచి ఇప్పుడు ఎవర్నీ లవ్ చేసే టైమ్ కాదు.
వన్ ఇయర్ తర్వాత డెసీషన్ చెబుతానని చెప్పి టైమ్ తీసుకో...! ‘వాళ్లు ఆగుతారా సార్?’ ఆగక ఏం చేస్తారు నీలూ? ప్రతి ఒక్కడు నన్నే చేసుకోవాలని.. చాలా గుడ్ బాయ్స్‌లాగా ఉంటారు. ‘అంతలోకి భానుకి జ్ఞానోదయమయ్యి.. ఒక మంచి డెసీషన్ తీసుకుంటుంది కదా సార్!!’ అబ్బబ్బబ్బబ్బా.. నీలూ...... ‘ఐ నో సార్, ఐ యామ్ వెరీ స్మార్ట్!!’
- ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment