
హాయ్ సార్..! నేను ఒక అబ్బాయిని గత మూడేళ్లుగా లవ్ చేస్తున్నాను. తను నా ఎంబీఏ క్లాస్‌మేట్. నా ఫ్రెండ్స్ నన్ను ఫోర్స్ చేసి, తన లవ్‌ని యాక్సెప్ట్ చేసేలా చేశారు. మొదట్లో తను నాతో చాలా బాగా ఉండేవాడు. కానీ ఈ మధ్య తను జాబ్‌లో జాయిన్ అయిన దగ్గరి నుంచి నన్ను తక్కువగా చూస్తున్నాడు. ఏం మాట్లాడినా చులకన చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకలా మాట్లాడుతున్నావని అడిగితే, ‘నువ్వు అమ్మాయివి. ఏం చెబితే అది చేయాలి, పడుండాలి’ అంటున్నాడు. ఆ మాటలను భరించలేక తనతో మాట్లాడటం మానేశాను. దాంతో వాళ్ల ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, ‘వాణ్ని అర్థం చేసుకో. తనని మిస్ చేసుకోకు’ అన్నాడు. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తాడు సార్. నాకేమీ అర్థం కావడం లేదు. తనంటే నాకు చాలా ఇష్టం. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – లక్ష్మి
లక్ష్మి బంగారం.... వాడు ఒక బుద్ధి లేని యూజ్‌లెస్ ఫెలో! అసలు వన్ మినిట్ కూడా భరించకూడని శుద్ధ దండగ కేసు...! వాడికి అమ్మాయిని గౌరవించడమే తెలియదు. వాణ్ని పెళ్లి చేసుకుంటే నరకం చూపిస్తాడు. నీకు దండం పెడతా చెల్లి. వాడొద్దు. వాడి ప్రేమ వద్దు.
వాడి నీడ వద్దు. ‘సార్... నిజమే సార్..! అసలు వద్దు, యూజ్‌లెస్ ఇడియట్ సార్ వాడు. అమ్మో, అలాంటి వాడితో వన్ డే ఉన్నా... పిచ్చెక్కి పోద్ది సార్.. మీ సిస్టర్ రియల్లీ లక్కీ సార్!’ ఎందుకు నీలూ! ‘మీలాంటి మంచి అన్నయ్య ఉన్నందుకు సార్’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ , లవ్ డాక్టర్