
హాయ్ సార్..! చాలారోజులుగా నేనొక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను లవ్ చేస్తోంది. చాలాసార్లు నాకు ప్రపోజ్ చేసింది. కానీ, నేనైతే ఎప్పుడూ ఓకే చెప్పలేదు. ఎందుకంటే నాకు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. బట్ తనంటే నాకు చాలా ఇష్టం. నేను లేకపోతే తను సూసైడ్ చేసుకుంటా అంటోంది. ఒకవేళ తనకి నేను ఓకే చెప్పినా, మా ఇంట్లో మా పెళ్లికి ఓకే అంటారన్న నమ్మకం నాకులేదు. అలా అని తనని వదులుకోలేకపోతున్నా. అన్నింటికీ తెగించి ప్రపోజ్ చెయ్యలేకపోతున్నా. ప్లీజ్ సార్ నాకో మంచి సలహా ఇవ్వండి. – మనోజ్
అమ్మాయికి ఉన్న దమ్ములో వన్ పర్సెంట్ ఈ హీరోకి ఉంటే.... ‘ఉంటే ఏం అయ్యేది సార్?.. పళ్లు రాలేవి. మమ్మీడాడీ ఇచ్చే పాకెట్ మని కట్టయ్యేది. అమ్మాయి తాలూకు బంధువులు... ‘‘తియ్యండ్రా బండ్లు!’’ అంటూ గొడ్డళ్లు.. కొడవళ్లు తిప్పుతూ ఇంటిమీద పడితే... హీరో ఫైట్ చేస్తాడా సార్?’ డౌటే నీలాంబరీ... ఇప్పటిదాకా అమ్మాయికి మనసు విప్పి మాట చెప్పనోడు, ఇంట్లో వాళ్లకి విషయం చెప్పలేనివాడు.. లవ్ కోసం ఫైట్ చెయ్యడం కష్టమే.
కానీ..... ‘కానీ ఏంటి సార్...????!’ అమ్మాయి జీవితం పాడవకూడదని తన ప్రేమను గుండె గూడులో దాచుకుని జీవిస్తున్నవాడు కూడా గ్రేట్ లవర్ కదా నీలూ?! ‘సార్... కన్ఫ్యూజ్ చెయ్యకుండా ఏం చేస్తే కరెక్టో చెప్పండి సార్!’ఇంట్లో విషయం చెప్పి ఒప్పించగలిగితే.. హీరో నంబర్ వన్!!n ‘ఇంట్లో కన్విన్స్ చెయ్యలేకపోతే.....?’ ఫైటర్ నంబర్ వన్! ‘ఎలాగైనా అమ్మాయికి ఆన్సర్ చెప్పమని చెబుతున్నారా సార్!?’ ఎగ్జాక్ట్‌లీ!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్