
హాయ్ సార్... మీరు ఇచ్చే ఆన్సర్స్ నాకు బాగా నచ్చుతాయి. నేను లవ్ చేస్తున్న అమ్మాయి కూడా మీ కాలమ్ డైలీ చదువుతోంది. సార్! నా ప్రాబ్లమ్ ఏంటంటే... నేను తనని త్రీ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఫోన్‌లో టచ్‌లో ఉన్నాను. ఆ అమ్మాయి రోజు మెసేజ్‌లు, కాల్స్ చేస్తోంది. నేను రోజూ సినిమా డైలాగ్స్‌తో ప్రపోజ్ చేస్తుంటాను. కానీ తను మాత్రం ‘మా బావను లవ్ చేస్తున్నాను’ అంటోంది. అయినా కూడా నాతో ఫోన్‌లో మాట్లాడుతోంది. తనని ఎలా మార్చుకోవాలో అర్థం కావట్లేదు. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – రాఘవ
అమ్మాయి మైండ్ నువ్వు ఎలాగైనా మార్చాలి రాఘవ..! ‘ఏంటి సార్, మీ చెల్లెలు లవ్ చేస్తున్న బావను కాకుండా రాఘవను ప్రేమించమని చెబుతున్నారా?’ అబ్బా నువ్వు చాలా స్మార్ట్ నీలూ... విషయాన్ని ఇట్టే పట్టేశావ్. ‘వెటకారం వద్దు సార్.. అసలు మీరు మీ చెల్లెళ్లు చేసేవన్నీ కరెక్ట్... అబ్బాయిలు నాట్ కరెక్ట్ అని బిలీవ్ చేసి... అబ్బాయిల జీవితాలతో ఆడుకునే టైప్ కదా సార్?? మరి, ఒక్కసారిగా ఇలా కొత్త డైలాగ్ కొడితే... సమ్‌థింగ్ రాంగ్ అనిపించి... బావకు హ్యాండ్ ఇచ్చి రాఘవ హ్యాండ్ పట్టుకోమంటున్నారేంటి???’
ఆలోచించకు నీలూ... సేమ్ ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు ఏదైనా ప్రాబ్లమ్‌తో పుడతారని...! ‘ఓ.. అందుకా సార్..!! మరి మీ చెల్లెలి హార్ట్ బ్రేక్ అయితే???’ ఉన్నాడు కదా రాఘవ... వీడని గమ్ములా.. అంటే జిగురులా వాడుకుని హార్ట్‌ను అతికించుకుంటుంది. ‘ఆ తర్వాత... కోలుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ మీ చెల్లెలికి మీరే అడ్వైజ్ ఇస్తారు.. అంతా సెటిల్ అయింది, ఇప్పుడు రాఘవకి హ్యాండ్ ఇవ్వమని కదూ సార్?’ అవ్వ.. నేనలా ఎందుకు చేస్తాను నీలూ? రాఘవ కరెక్ట్ బాయ్ అనుకుంటే అమ్మాయే ఓకే చెబుతుంది. స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఉంటుంది..!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment