
హాయ్ సార్..! నేను రీసెంట్‌గా మా ఆఫీస్‌లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని చూసినప్పట్నుంచి రోజులో చాలావరకు ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను. నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానేమో అనిపిస్తోంది. ప్రతిరోజు ఆఫీస్‌లో ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమో లేదో ఎలా తెలుసుకోవాలో చెప్పగలరా? నాకు మాత్రం ఆ అమ్మాయంటే చాలా ఇష్టం. దయచేసి మంచి సలహా ఇవ్వండి. – మహేంద్ర
డోంట్ టాక్ లైక్ దట్!! ‘ఏంటి సార్..! ఏం తప్పన్నాడని మహేంద్రని డోంట్ టాక్ అంటున్నారు. చాలా హర్ట్ అవుతాడు సార్!’ డోంట్ టాక్ లైక్ దట్ నీలూ...!! ‘సార్...! నేను కూడా హర్ట్ అవుతున్నాను సార్!’ నో!! డోంట్ టాక్ లైక్ దట్ నీలాంబరి..!‘ఏంటి సార్ మీ లొల్లి?’ అరే, రోజూ మాట్లాడుతున్నాడు కదా! ‘కదా!?!’ మరి అలా పెంట మాట్లాడకుండా... ‘ఏం పెంట మాట్లాడుతున్నాడు సార్?’ ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారు? నిన్న ఎండ బాగా ఉంది కదూ? రేపు వాన పడుతుందా? ఎల్లుండి మళ్లీ సన్ గరం గరంగా కొడతాడా?
అవతలెల్లుండి మళ్లీ వాన పడుతుందా? ఇవన్నీ పెంట మాటలే కదా నీలూ?! ‘ఓ.. ఓహో.. ఓహోహో..! లవ్ గురించి మాట్లాడకుండా రోజూ ఈ మాటలేంటి.. పెంట తప్పా? అందుకే డోంట్ టాక్ లైక్ దట్ అంటున్నారా సార్? మీరు మేధావులు సార్. మీ మాటలు అర్థం చేసుకోవడానికి మేము మేధావులమైనా కావాలి. లేదంటే వీసమంత పిచ్చైనా ఉండాలి.’ డోంట్ టాక్ లైక్ దట్ నీలూ!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment