
హాయ్ అన్నయ్యా!! నేను, ఒక అబ్బాయి గత ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటామని ఇంట్లో కూడా చెప్పాం. కానీ మా పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు. మా ఇద్దరి నేపథ్యాలు వేరుకావడమే వాళ్లకు పెద్ద సమస్య. తనేమో ‘‘ఎలాగైనా ఒప్పించు.. మాట్లాడు’’ అంటున్నాడు. తను కూడా మా వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినా ఒప్పుకోవడం లేదు. దాంతో మా ఫ్రెండ్స్ ‘‘ఇంట్లోంచి వచ్చి పెళ్లి చేసుకోండి. కొన్ని రోజులకు వాళ్లే అర్థం చేసుకుంటారులే’’ అంటున్నారు. కానీ నాకు అలా రావడం ఇష్టం లేదన్నయ్యా. నా పేరెంట్స్ కూడా నా జీవితంలో ఓ భాగమే. అలా అని వాళ్లు చెప్పిన వ్యక్తిని చేసుకుని నా ప్రేమని వదులుకోలేను. చచ్చిపోవాలనిపిస్తోంది ఇదంతా ఆలోచిస్తుంటే. ఏమైనా సలహా చెప్పండి ప్లీజ్? – అనన్య
బంగారం.. తొందరెందుకూ! ఇది జీవితం రా..! టైమ్ తీసుకోవాలి...!! ‘అవును.. అబ్బాయిని వదిలెయ్యాలి.. అదే కదా సార్ మీరు చెప్పేది..!?! ఎన్ని ఆశలతో మీకు రాస్తారు.. మీరేమో బ్రెయిన్ వాష్ చేసి.. ప్రేమ, పెళ్లి అన్నీ ఆపేస్తూ ఉంటారు.. ‘‘తొందరేముంది బంగారం....’’ అని రాంగ్ రూట్‌లో పెట్టి అమ్మాయిని అబ్బాయికి దూరం చేసే ప్లాన్ కదా సార్ మీది...!? యు ఆర్ ది ఎనిమీ ఆఫ్ లవ్ సార్!!’ ఎన్నేసి మాటలంటున్నావు నీలూ...?
నా లాంటి గుడ్ హార్ట్‌ని అన్నేసి మాటలంటే నువ్వే బ్యాడ్ అయిపోతావు!!‘గుడ్డు హార్ట్ అంట డ్యాష్ గుడ్డు హార్ట్..!? చెప్పండి సార్... ఏమి చెబుతారో అనన్యకు!! ప్రేమ వద్దు అని చెప్పారో... అరటిపండు వద్దని నేను చెబుతా..!’ తొందరేముంది బంగారం.. నువ్వు మేలిమి బంగారం.. ఇన్ని రోజులు నిన్ను ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రులను నువ్వు గౌరవించడం నాకు చాలా నచ్చింది. యు ఆర్ ఎ స్వీట్ హార్ట్ సిస్టర్. అబ్బాయి మంచోడే. ఎందుకంటే తాను కూడా నీ పేరెంట్స్‌ని కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు.
మీ ఇద్దరి మంచితనమే మీ పేరెంట్స్‌ని మార్చుద్ది. అమ్మానాన్నలతో వీలయినప్పుడల్లా నీ ప్రేమ గురించి మాట్లాడు. డోంట్ షై అవే! నీలో నువ్వు కుమిలిపోకు!! నీ బాధను తల్లిదండ్రులతో కంటిన్యూయెస్‌గా డిస్కస్ చెయ్యి. ముందు కొంచెం కోప్పడతారు. ఆ తరువాత విసుక్కుంటారు. ఆ తరువాత నీ చేత మారాం చేయిస్తారు. కానీ కూతురు సంతోషాన్ని మించింది వాళ్లకు ఏదీ లేదు.
కులం.. హోదా.. పరపతి.. అన్నీ ఉండి పిల్ల సంతోషంగా లేకపోతే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారా?? ఏ మాత్రం ఉండరు!! ప్రపంచాన్ని గెలిచే ముందు మీ ప్రేమ విషయంలో ముందు మీ పేరెంట్స్‌ని గెలవండి. ఐ యామ్ ష్యూర్ యు విల్ సక్సీడ్. డోన్ట్ గివ్ అప్ లవ్. డోన్ట్ గివ్ అప్ పేరెంట్స్.. లవ్ యూ తల్లీ. ఆల్ ది బెస్ట్!!
‘సార్ టేక్ టూ అరటిపండ్లు.. సార్.. యు ఆర్ లవ్లీ!!’
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment