
హాయ్ సార్, నేను మీ అభిమానిని. మీ ప్రతి మాటనీ ఫాలో అవుతా. నేనొక అమ్మాయిని ప్రేమించా. ప్రేమించేలా చేసింది తనే. నాకు తెలీకుండానే తను నా జీవితం అయిపోయింది. నా ప్రతి ఆలోచన తానే. తనకి ఫోన్ చేస్తే గంటల తరబడి ఎంగేజ్ వచ్చేది. ఆ క్షణంలో తను వేరెవరితోనో మాట్లాడుతుం అనే భావన కూడా తట్టుకోలేకపోయేవాణ్ని. అది తాను అనుమానమంటూ నిందించేది. తాను నాతోనే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకునేవాణ్ని. బట్ తాను నాతో మొత్తానికే మాట్లాడటం మానేసింది. నేను మాత్రం ఈ నరకం భరించలేకపోతున్నా. బతికేందుకు తాను లేదు. చచ్చేందుకు ధైర్యం లేదు. నాది ప్రేమకాదా? – వర్ధన్
నీది హండ్రెడ్ పర్సెంట్ లవ్!! అమోఘమైన లవ్!! అనిర్వచనీయమైన లవ్!! ఆకాశమంత ఎల్తైన లవ్!! భూలోకమంత సహనమున్న లవ్!! ‘సముద్రమంత డీప్ లవ్..!! ఏంటి సార్ అక్కడ అబ్బాయి సమాధానం అడుగుతుంటే.. ప్రకృతి క్లాస్ చెబుతున్నారు....??? ఫైనల్లీ మీరు చెప్పేదేంటో నాకు ఆల్ రెడీ తెలుసు...!! చదువుతున్న పాఠకులకు కూడా తెలుసు...!! వర్ధన్‌కి కంపల్సరీగా తెలుసు.. సార్!!’సరే.. నేను ఇక్కడితో ఆపేస్తా! ‘ఆపేస్తే.. నేను అరటిపండు ఆపేస్తా సార్!’
ఏంటి నీలూ... ఈ బ్లాక్ మెయిల్ టెక్నిక్..? ‘క్వశ్చన్‌కి స్ట్రైట్‌గా ఆన్సర్ చెప్పండి సార్...!’ అవునూ...!? నాకు తెలుసు.. వాళ్లకీ తెలుసు.. వీళ్లకు తెలుసు.. అన్నావుగా.... ఏం తెలుసు నీలూ..!?! ‘అమ్మాయిని వదిలేసి హ్యాపీగా ఉండరా గురుడా...! అని చెబుతారని తెలుసు!!’ హు.. హు.. హు.. ఇక్కడే నువ్వు తొక్కమీద కాలేసావు నీలూ.. యు హేవ్ స్లిప్డ్ ఆన్ యువర్ ఓన్ తొక్కా..! ‘సరే సార్ నేను స్లిప్డ్.. మీరు నోరు జారకుండా చూసుకోండి సార్!’ ప్రేమను అనుమానం అన్నది! నువ్వు ఫోన్ కొడుతుంటే.. ఆమె ఫోన్ ఎంగేజ్‌లో పెట్టింది!! నువ్వు వద్దన్నా నిన్ను ప్రేమలో పడేసింది!! ఇప్పుడు బయట పడేసింది!! నిన్ను ఆట ఆడేసుకుంది!! మరి ఇప్పుడు నువ్వు గేమ్ షురూ చెయ్యాలి! ‘పడి ముక్కు మూతి పగలకొట్టుకున్నోడు ఏమి స్టార్ట్ చేస్తాడు సార్ గేమ్..? తొక్కలో ప్రేమ.. జీవితం కంటే గొప్పదా..?
నా మాట విను వర్ధన్..! లైఫ్‌లో ఎన్నో ఛాన్స్‌లు వస్తాయి..! అప్పుడు ప్రేమించు..! నిన్ను తొక్కలా చూసే అమ్మాయిని నీవు అసలు పట్టించుకోవద్దు..! బ్రేక్ అవే ఫ్రమ్ దిస్ ట్రాప్..!! బీ హ్యాపీ.. వర్ధన్..! ఏమంటారు సార్?’ నేను ఇలా చెబుతానని క్లాస్ పీకి... నువ్వే చెప్పేసావా నీలూ..? నీ హార్ట్ గోల్డ్..!! ప్రేమలో ఎవ్వరూ ఫూల్ కాకూడదు. హీరోలే కావాలి. శహభాష్ నీలూ..! ఇదిగో అరటిపండు నీకోసం..!!
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్