హాయ్ అన్నయ్యా! నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. తను మా సీనియర్. తను కూడా నన్ను లవ్ చేశాడు. ఇద్దరికీ మంచి జాబ్స్. పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. ప్రాబ్లమ్ ఏంటంటే.. తను నాకంటే ముందు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. కానీ, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. తనతో అప్పుడప్పుడూ మాట్లాడుతుంటాడు. ఇప్పటికీ తనంటే ఇష్టమని చెబుతుంటాడు. ఆ అమ్మాయితో మాట్లాడటం నాకు నచ్చడం లేదు. ఇదే విషయం తనకి చెబితే... ‘‘తను నా ఫస్ట్ లవ్. నేను మరిచిపోలేను. తను నా లైఫ్‌లో ఎప్పటికీ ఉంటుంది.
తను ఉండకూడదు అనుకుంటే నువ్వే వెళ్లిపో’’ అని తెగేసి చెప్పాడు. ఇప్పుడున్న నాకంటే వెళ్లిపోయిన ఆ అమ్మాయినే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు ‘‘నువ్వు నాకు నచ్చలేదు’’ అని చెబుతాడు. ఇప్పుడు పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికీ ఆ అమ్మాయిని ఇష్టపడుతుంటే తనని నా లైఫ్‌లోకి మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నా. వద్దు అని తప్పుకోలేకపోతున్నా. ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నేనంటే ఇష్టంలేని వాడిని పెళ్లి చేసుకున్నానని జీవితాంతం బాధపడుతూ ఉండాలి. వద్దు అనుకుంటే.. అమ్మవాళ్లకి ఏం చెప్పాలో అర్థం కావడంలేదు. – మోనిక
అమ్మవాళ్లకు చెప్పలేకపోతున్నావు కాబట్టి.. బురదలో దొర్లుతావా? మూర్ఖత్వం కాదూ!! ఒక పెళ్లి అయిపోయిన అమ్మాయి జీవితంలోకి మళ్లీ ఎంటర్ అవ్వడమే తప్పు. ఆ అమ్మాయి లైఫ్ పాడవడమే కాకుండా... నీ లైఫ్ కూడా చెత్త చేస్తున్నాడు..! వాడొక మెంటల్ కేస్..! వాడికి ప్రేమ లేదు..! పిచ్చి ఉంది..! నా మాట విని పెళ్లయిపోయిన అమ్మాయితో ఒకసారి మాట్లాడు!
లైఫ్ పాడు చేసుకోవద్దని అడ్వైజ్ ఇవ్వు! ఇంకొకరికి ఇచ్చిన అడ్వైజ్ నువ్వు కూడా ఫాలో అవ్వు! లీవ్ ది క్రీప్. అండ్ బీ హ్యాపీ!! ‘వాడి ప్రేమ కాంప్లికేటెడ్ అయినా మోనికా లవ్ ఫ్యూర్ కదాసార్..? ఎలా అంత ఈజీగా వదిలేసుకోవడం??’ లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది! డౌట్లో, ఫియర్లో.. కుంగిపోతుంది!! ఎందుకు చేసుకున్నాను ఇలాంటి మనిషిని అని రిగ్రెట్ చేస్తుంది!! దానికంటే ‘ఛీ’ అనేస్తే లైఫ్ బాగుంటుంది. వద్దు మోనికా... డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్!!
– ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment