టెల్ అవీవ్: గాజాలో యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హమాస్ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు.
గాజాలోని 25 వేల మంది ప్రజలు మృత్యువాత, 85% మంది ప్రజలు వలసబాట పట్టిన నేపథ్యంలో యుద్ధం విరమించుకునేలా చర్చలు జరపాలంటూ ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా సహా పలు దేశాలు ‘రెండు దేశాల’విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతున్నాయి. అయితే, నెతన్యాహు తాజా ప్రకటనతో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయంలో మార్పులేదని స్పష్టమైంది. నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికాలు ఒకే అంశంపై భిన్నంగా ఆలోచించడం సహజమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment