Man Proposes To His Girlfriend Using A Special Keyboard - Sakshi
Sakshi News home page

Love Proposal: ఇలాంటి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో.. ప్రేయసికి వెరైటీగా ప్రపోజల్‌

Published Sat, Jul 8 2023 1:12 PM | Last Updated on Fri, Jul 14 2023 3:29 PM

Man Proposes To His Girlfriend Using Special Keyboard - Sakshi

ప్రేమ అనేది మధురానుభూతి. ప్రేమించడం సులువే కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత ఈజీ కాదు. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్‌ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు. గ్రీటింగ్ కార్డ్స్ ద్వారానో, బహుమతుల ద్వారానో, సర్‌ప్రైజ్‌లతోనే వెరైటీగా లవ్‌ ఎక్‌ప్రెస్‌ చేస్తుంటారు.

ఇంకొందరు అబ్బాయిలైతే సినిమా హీరోల్లా తమ ప్రేయసికి ప్రపోజ్‌ చేస్తుంటారు. అయితే రీసెంట్‌గా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ కోసం డిఫరెంట్‌గా ప్రపోజ్‌ చేశాడు. ఈ వెరైటీ ప్రపోజల్‌కి నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. దీంతో వీరి ప్రేమకథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇప్పటివరకు బోలెడన్ని లవ్‌ ప్రపోజల్స్‌ గురించి విన్నాం,చూశాం. కానీ ఓ యువకుడు ఇంకాస్త వెరైటీగా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ప్రేయసి కోసం ప్రత్యేకంగా ఓ కీబోర్బ్‌నే డిజైన్‌ చేసి ఆమెకు ప్రపోజ్‌ చేశాడు.

‘బీ మై గర్ల్‌ ఫ్రెండ్‌ సెయాంగ్‌?’ ( Be my girlfriend Seyang ) అనే వాక్యం వచ్చేలా ఇంగ్లీష్ అక్షరాలతో కొన్ని బటన్స్‌ను అమర్చి ఆమెకు ప్రజెంట్‌ చేశాడు.ఈ వినూత్న ప్రపోజల్‌కి ఆ యువతి ఫిదా అవ్వడమే కాక, ఆనందంతో ఎగిరి గంతేసింది. 'నా బాయ్ ఫ్రెండ్ చాలా అద్భుతమైన రీతిలో ప్రపోజ్ చేశాడు.

ఈ ఆనందాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను' అంటూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీరి ప్రేమ కహానీ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ కపుల్‌కి కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement