ప్రేమను ఎన్ని పదాల్లోనూ, ఎన్ని విధాల్లోనూ వర్ణించినా తీరనిది. ప్రేమకు భాషతో పని లేదు భావం చాలు.. ఎంతటి వారినైనా ఆకర్షించే గుణం దీనికి ఉంటుంది. ప్రేమ మాయలో పడితే ప్రపంచాన్నే మరచిపోతారంటారు. అలాంటి ప్రేమను గెలవాలంటే మన మనుసులోని మాటను ముందుగా ఎదుటి వారికి తెలియజేయాలి.
ప్రేమను తెలిపేందుకు ఎన్ని మార్గాలున్నా.. సూటిగా చెప్పే పదం ఐ లవ్ యూ. దీనినే షార్ట్‌కట్‌లో 143 అంటారు. చంటి పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ల వరకు కూడా ఈ పదం సుపరిచితమే.. మరి 831 224 అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా దీని గురించి విన్నారా..? ప్రస్తుతం ఈ నెంబర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఇది ఏంటో తెలుసుకుందాం.
831 224 అనే సంఖ్య కూడా ప్రేమకు సంబంధించినదే. ‘ఐ లవ్ యు టుడే, టుమారో, ఫర్ ఎవర్’ (I love you today, tomorrow, forever) అనే అర్థంలో దీనిని వాడతారు. అయితే ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే.. సాధారణంగా స్నాప్‌చాట్, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ టిక్‌టాక్ వంటి వాటిల్లో 831ను తరుచూ వాడుతుంటారు. 831 అనేది "ఐ లవ్ యు" అని అర్ధం చేసుకోవడానికి ఉపయోగించే సంక్షిప్త పదం. ఇందులోని ప్రతి సంఖ్యకు నిర్దిష్ట నిర్వచనం ఉంటుంది.
8 = "ఐ లవ్ యు" అనే పదసమూహంలోని మొత్తం అక్షరాల సంఖ్య.
3 = "ఐ లవ్ యు" అనే పద సమూహంలోని మొత్తం పదాల సంఖ్య.
1 = ఈ ఎనిమిది అక్షరాలు, మూడు పదాల అర్థం ఒక్కటే.
అయితే 224 సంఖ్యను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాడుతుంటారు. నేడు, రేపు, ఎప్పటికీ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే పదం
2 = ‘టు’డే (ఈరోజు)
2 = ‘టు’మారో(రేపు)
4 = ‘ఫర్’ ఎవర్ (ఎప్పటికీ)
ఇప్పుడు తెలిసిందిగా 831 224 నెంబర్‌ను ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారో.. ప్రస్తుతం ఈ సంఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాగే ఇటీవల మరో నెంబర్ 5201314 కూడా వైరల్ అయ్యింది. దాని అర్థం "నేను నిన్ను జీవితకాలం ప్రేమిస్తున్నాను అని. ఇంకెందుకు ఆలస్యం మరి మీ ప్రియురాలు/ ప్రియుడిని ఇలా కొత్తగా, ఢిఫరెంట్‌గా ప్రపోజ్ చేసి చూడండి.
చదవండి: Viral Video: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు.. ఏమాత్రం సిగ్గు పడకుండా ఆమెకు ముద్దు పెడుతూ..
Comments
Please login to add a commentAdd a comment