Definition
-
ఇది ఒక అమూల్యమైన సంపద..
తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అద్భుతమైన మానవీయ సంబంధాలు. వారి సమక్షం ఒక విశ్వవిద్యాలయమే. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక పాఠశాల ఉంది. పాఠశాలల్లో పేరంట్స్ డే జరపడం సర్వసాధారణమే.. కానీ అక్కడ గ్రాండ్ పేరెంట్స్ డే కూడా జరుపుతారు. అటువంటి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత గొప్ప విశేషమో తెలియ చేయడానికి వారిని ఎందుకు గౌరవించాలో బోధపరచడానికి వారీ ఉత్సవం నిర్వహిస్తారని తెలిసి చాలా సంతోషమేసింది. తాతలు, నానమ్మలు, అమ్మమ్మల దగ్గర పెరిగిన పిల్లల్లో ధైర్యం, సంస్కారం ఎక్కువగా ఉంటుందని ఆ పాఠశాల ప్రిన్సి΄ాల్ తన ప్రసంగంలో తెలియచేసారు. అటువంటి పెద్దల సమక్షంలో పెరిగే పిల్లల మానసిక పరిణతి, సంస్కారబలం వృద్ధి చెందుతాయి. పెద్దల విలువని ఎంతని లెక్కగట్టగలం!!! వారు లేరని బాధపడేవాళ్ళుంటారు చాలా మంది... అటువంటప్పుడు వారిని ఓల్డ్ ఫర్నీచర్ అని తప్పించడం ఎంత నీతిబాహ్యమైన చర్య? తండ్రి పెద్దవాడయిపోయాడు. కొడుకు భుజం మీద చెయ్యివేసుకుని వెళ్ళడం ఒక ఠీవి. తండ్రి చేతిని కొడుకు పట్టుకుని తీసుకెళ్ళి కూర్చోబెడితే అదొక ఠీవి. నా కొడుకును సహాయంగా తీసుకుని బయటకు వెళ్ళి రావడం నా అవసరం, నా ఆనందం. దాని ప్రయోజనం మరొకరికి ఎలా తెలుస్తుంది? కొదుకు ఎక్కడ ఉంటే అక్కడ ఉపశమనం. కోడలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఊరట. మనసుకు గొప్పశాంతి. అది సంపద. అంత గొప్ప సంపదకు దూరంగా ఏకాకిగా బతకడమా!!! మనుమలతో కలసి బతకడం భగవంతుడిచ్చిన గొప్ప భాగ్యం. వారిలో తమను తాము చూసుకోవడం పెద్దలకు పెద్ద ఓదార్పు. ఈశ్వరుడిచ్చిన ఇంత గొప్ప సంపద నాకు ఎవరి వలన లభిస్తున్నది... కోడలు వలన. అంటే వివాహం అనేది ఈ సంపద సృష్టికి మూల కారణం అవుతున్నది. స్థిరచరాస్తులు ఎంత పోగేసుకున్నాం అన్నదానికంటే... కుటుంబంలో మనుషుల మధ్య మనసులు ఎంతగా కలిసాయన్నది ఈ ఆనందాలకన్నింటికీ హేతువవుతుంది. ఆరోగ్యకర సమిష్టి జీవనానికి దారివేస్తుంది.జీవితాన్ని కూడా గాలికి వదిలేసి సంపాదన లో మునిగితేలేవాడికి సంసార సుఖం తెలియదు. సంపాదన అవసరమే, కానీ సంసార జీవితాన్ని కలిసికట్టుగా ఆస్వాదించపోతే ఇక గహస్థాశ్రమ వైభవం ఎక్కడుంది? దాని ఫలాలను నీవెక్కడ ఆస్వాదిస్తున్నావు? అంటే బతకడానికి సం΄ాదన... అంతే తప్ప సంపాదన కోసం బతకడం కాదు కదా! శ్రీమంతుల ఇంట అయినా పేదల ఇంటయినా... అరమరికలు లేకుండా ఉమ్మడిగా బతకడం వర్తమానంలో సంతోషాలకే కాదు, తరువాత తరాలకు కూడా సంతోషకారకాలను అందిస్తున్నాం. అందుకే కొడుకు, కోడలు, కుమార్తె, అల్లుడు, తల్లిదండ్రులు, అత్తమామలు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, మనుమలు.. ఇదంతా గొప్ప సంపద. ఈ సంపదకు మూలం వివాహ వ్యవస్థ. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం ఒక వైభవానికి నాంది. -
ప్రేమలో పడ్డారు సరే, ‘831 224’ అని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా?
ప్రేమను ఎన్ని పదాల్లోనూ, ఎన్ని విధాల్లోనూ వర్ణించినా తీరనిది. ప్రేమకు భాషతో పని లేదు భావం చాలు.. ఎంతటి వారినైనా ఆకర్షించే గుణం దీనికి ఉంటుంది. ప్రేమ మాయలో పడితే ప్రపంచాన్నే మరచిపోతారంటారు. అలాంటి ప్రేమను గెలవాలంటే మన మనుసులోని మాటను ముందుగా ఎదుటి వారికి తెలియజేయాలి. ప్రేమను తెలిపేందుకు ఎన్ని మార్గాలున్నా.. సూటిగా చెప్పే పదం ఐ లవ్ యూ. దీనినే షార్ట్‌కట్‌లో 143 అంటారు. చంటి పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ల వరకు కూడా ఈ పదం సుపరిచితమే.. మరి 831 224 అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా దీని గురించి విన్నారా..? ప్రస్తుతం ఈ నెంబర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరి ఇది ఏంటో తెలుసుకుందాం. 831 224 అనే సంఖ్య కూడా ప్రేమకు సంబంధించినదే. ‘ఐ లవ్ యు టుడే, టుమారో, ఫర్ ఎవర్’ (I love you today, tomorrow, forever) అనే అర్థంలో దీనిని వాడతారు. అయితే ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే.. సాధారణంగా స్నాప్‌చాట్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ టిక్‌టాక్ వంటి వాటిల్లో 831ను తరుచూ వాడుతుంటారు. 831 అనేది "ఐ లవ్ యు" అని అర్ధం చేసుకోవడానికి ఉపయోగించే సంక్షిప్త పదం. ఇందులోని ప్రతి సంఖ్యకు నిర్దిష్ట నిర్వచనం ఉంటుంది. 8 = "ఐ లవ్ యు" అనే పదసమూహంలోని మొత్తం అక్షరాల సంఖ్య. 3 = "ఐ లవ్ యు" అనే పద సమూహంలోని మొత్తం పదాల సంఖ్య. 1 = ఈ ఎనిమిది అక్షరాలు, మూడు పదాల అర్థం ఒక్కటే. అయితే 224 సంఖ్యను కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాడుతుంటారు. నేడు, రేపు, ఎప్పటికీ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే పదం 2 = ‘టు’డే (ఈరోజు) 2 = ‘టు’మారో(రేపు) 4 = ‘ఫర్’ ఎవర్ (ఎప్పటికీ) ఇప్పుడు తెలిసిందిగా 831 224 నెంబర్‌ను ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారో.. ప్రస్తుతం ఈ సంఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాగే ఇటీవల మరో నెంబర్ 5201314 కూడా వైరల్ అయ్యింది. దాని అర్థం "నేను నిన్ను జీవితకాలం ప్రేమిస్తున్నాను అని. ఇంకెందుకు ఆలస్యం మరి మీ ప్రియురాలు/ ప్రియుడిని ఇలా కొత్తగా, ఢిఫరెంట్‌గా ప్రపోజ్ చేసి చూడండి. చదవండి: Viral Video: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు.. ఏమాత్రం సిగ్గు పడకుండా ఆమెకు ముద్దు పెడుతూ.. -
మ్యాడ్స్కిల్స్కు మహర్దశ.. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే?
మీరు కబడ్డీలో మేటి కావచ్చు. సంగీతంలో ఘనాపాఠీ కావచ్చు. సాహసాలు చేయడంలో ‘వారెవా’ అనిపించవచ్చు... అయితే ఇవి మీ అభిరుచి, ఆసక్తికి మాత్రమే పరిమితం కావడం లేదు. మీరు మంచి ఉద్యోగంలో ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించే శక్తులు అవుతున్నాయి. కాలంతో పాటు ఉద్యోగ ఎంపిక ప్రమాణాలలో కూడా మార్పు వస్తోంది. ఉద్యోగం రావడానికి ఉపకరించే హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ విభాగాలకు ఇప్పుడు మూడో విభాగం కూడా తోడైంది. అదే... మ్యాడ్ స్కిల్స్. ఇంతకీ మ్యాడ్‌స్కిల్స్ అంటే? ఉద్యోగప్రయత్నాలు చేసేవారి రెజ్యూమ్ లేదా సీవీలలో హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్‌స్కిల్స్ అని రెండు విభాగాలు ఉంటాయి. మొదటిది జ్ఞానాన్ని సర్టిఫికెట్లతో తూచే విషయం. రెండోది మార్కులు, ర్యాంకులతో పాటు నైపుణ్యబలాన్ని అంచనావేయడం. ఇప్పుడు ఈ రెండు విభాగాలతో పాటు ‘మ్యాడ్ స్కిల్స్’ అనే మూడో విభాగం కూడా తోడైంది. మ్యాడ్ స్కిల్స్ అనగానే వ్యంగ్యం, వ్యతిరేకత ధ్వనించవచ్చుగానీ... ఇక్కడ మ్యాడ్ స్కిల్స్ అంటే ‘పనికిరాని వృథా స్కిల్స్’ అని అర్థం కాదు. ఉద్యోగుల ఎంపికకు సంబంధించి కంపెనీల నిర్ణయాలలో ‘మ్యాడ్ స్కిల్స్’ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ కంటే ‘మ్యాడ్ స్కిల్స్’ను అరుదైన, అవసరమైన స్కిల్స్గా భావిస్తున్నాయి కంపెనీలు. ఒక మేనేజర్ పోస్ట్ ఎంపికలో అభ్యర్ధి అభిరుచులపై కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది గతంలో అంతగా లేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం అది ఒక అనివార్యమైన విషయం అయింది. రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌లు రెజ్యూమ్‌లోని ‘హాబీస్ అండ్ ట్రావెల్స్’ స్పేస్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ‘మ్యాడ్ స్కిల్స్’ను కంపెనీలు తమ ప్రత్యేక ఆస్తిగా భావించుకోవడానికి కారణం అవి క్రియేటివ్ స్కిల్స్ రూపంలో తమ కంపెనీకి తోడ్పడతాయనే నమ్మకం. ఉదాహరణకు కీర్తి అనే అమ్మాయి ఒక కంపెనీలో ఏదో ఉద్యోగానికి అప్లై చేసింది అనుకుందాం. కీర్తికి ‘ట్రెక్కింగ్’ హాబీ ఉంది. అయితే ఉద్యోగ ఎంపికలో అది ఆమె వ్యక్తిగత అభిరుచికి సంబధించిన గుర్తింపుకే పరిమితం కావడం లేదు. ఈ అభిరుచి ద్వారా కంపెనీలు తన వ్యక్తిత్వాన్ని అంచనావేయడానికి ఉపయోగపడుతుంది. ‘కొత్త ప్రదేశాలలో సర్దుకుపోగలదు’ ‘సవాళ్లను స్వీకరించగలదు’ ‘అందరితో కలిసిపోయే స్వభావం ఉంది’.. ఇలా కీర్తి గురించి కొన్ని అంచనాలకు రావడానికి వీలవుతుంది. ‘ఒక మేనేజర్ పోస్ట్‌కు పదిమంది వ్యక్తులు పోటీ పడితే, అందరి బలాలు సమానంగా ఉన్నాయనుకున్నప్పుడు మ్యాడ్ స్కిల్స్ కీలకం అవుతాయి. అభిరుచుల ఆధారంగా వ్యక్తిత్వంపై ఒక అంచనాకు రావడానికి ఇవి తోడ్పడతాయి. విభిన్నమైన అభిరుచులు, నైపుణ్యాలు, బలమైన వ్యక్తిత్వం, పర్సనల్ ప్రాజెక్ట్‌లకు కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి’ అంటుంది ‘యూ విల్ బీ ఏ మేనేజర్ మై సన్’ పుస్తక రచయిత్రి సాండ్రిన్. ఆటలు (ఫుట్‌బాల్ నుంచి చెస్ బాక్సింగ్ వరకు), ఆర్టిస్టిక్ యాక్టివిటీస్(రచనలు చేయడం నుంచి పాటలు పాడడం వరకు), ప్రధాన స్రవంతికి భిన్నంగా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం ... ఇలా ఎన్నో మ్యాడ్‌స్కిల్స్ (యూనిక్ క్రియేటివ్ స్కిల్స్) విభాగంలోకి వస్తాయి. ‘జాబ్ ఔట్లుక్ 2022’ సర్వే ప్రకారం ఉద్యోగ ఎంపికలో బడా కంపెనీలు ప్రాబ్లమ్ సాల్వింగ్–స్కిల్స్, ‘ ఇది మాత్రమే నా పని’ అని కాకుండా ఇతరత్రా విషయాలలో ‘చొరవ’ చూపించే నైపుణ్యం, రచన, కమ్యూనికేషన్ స్కిల్స్... మొదలైవాటికి అగ్రస్థానం ఇస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన వేర్లు ‘మ్యాడ్ స్కిల్స్’లోనే ఉన్నాయి! అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రతిధ్వనించిన ఎక్స్ప్రెషన్ మ్యాడ్ స్కిల్స్. సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు ఉద్యోగ ఎంపికలో మ్యాడ్ స్కిల్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పుడు యూరప్‌లో కూడా ఉద్యోగ ఎంపికలో ‘మ్యాడ్ స్కిల్స్’ ట్రెండ్‌గా మారింది. ‘మంచి మార్కులు, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరిౖయెన సమాధానాలు చెప్పడం అనేవి ఉద్యోగ ఎంపికలో కీలక పాత్ర పోషించినప్పటికీ, మ్యాడ్‌స్కిల్స్ ప్రాధాన్యత వేరు. కంపెనీ అభివృద్ధి చెందాలంటే భిన్నంగా ఆలోచించేవారు ఉండాలి. వారి నుంచే కంపెనీ అభివృద్ధికి అవసరమైన సృజనాత్మక ఐడియాలు వస్తాయి. హార్డ్‌స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ద్వారా అభ్యర్థిని సులభంగా అంచనా వేయవచ్చు. అయితే మ్యాడ్‌స్కిల్స్ ద్వారా అది అంత సులభం కాకపోయినా అసాధ్యం మాత్రం కాదు’ అంటున్నారు విశ్లేషకులు. ‘సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే నాకు ఇష్టం. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి సేవాకార్యక్రమాలు కూడా కీలక పాత్ర వహిస్తున్నాయి అనే విషయం తెలిశాక సంతోషం వేసింది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్. (క్లిక్ చేయండి: వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?) -
హక్కుల కోసం నినదించడం బాబు గిట్టని అంశం
-
కాపీకి డెఫినిషన్!
అనుసరణ మంచిదే కానీ అనుకరణ మంచిది కాదంటుంటారు పెద్దలు. ఒక్క సారి అనుకరించడం మొదలుపెడితే మనలోని సహజమైన ప్రతిభ మరుగున పడిపోతుందని వారి ఉద్దేశం. అయితే సినీ ఫీల్డ్‌లో ఈ మాటకు విలువ లేదు. అక్కడ అనుకరణ అనేది అతి సహజం. వేరే భాషల్లో విజయం సాధించిన చిత్రాలను అలవోకగా కాపీ కొట్టేయడం మామూలే. అలా అతి తేలికగా కాపీ కొట్టేసిన సినిమాల్లో ‘తొట్టిగ్యాంగ్’ మొదటి వరుసలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది కాపీకి నిర్వచనం. ఎందుకంటే కథో, కథనమో, ఏవో కొన్ని సన్నివేశాలో కాదు... సినిమా మొత్తాన్నీ ఓ ప్యాకేజీగా పట్టుకొచ్చి ఇక్కడ తీసేశారు. అచ్చిబాబు, సత్తిబాబు, సూరిబాబు చిన్నప్పట్నుంచీ ప్రాణ స్నేహితులు. ముగ్గురూ కలిసి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతారు. కుక్కల్ని పట్టుకుంటారు. అంత్యక్రియలు చేస్తారు. బతకడానికి పనికొచ్చే ఏ పనినీ వదలరు. వారి మధ్యలోకి చిన్నప్పటి క్లాస్మేట్ మల్లీశ్వరి ప్రవేశిస్తుంది. కరాటే చాంపియన్ అయిన ఆమె చేతిలో వాళ్లు చిన్నప్పుడే దెబ్బలు తినివుంటారు. దాంతో సత్తిబాబు, సూరి బాబులిద్దరికీ ఆమె అంటే భయం, అసహ్యం. కానీ అచ్చిబాబు మాత్రం ఆమె ప్రేమలో పడతాడు. మల్లీశ్వరి అతణ్ని స్నేహితులిద్దరికీ దూరం చేసేసి, నిశ్చి తార్థం చేసుకుంటుంది. దాంతో కడుపు మండిన ఆ ఇద్దరూ మల్లీశ్వరిని కిడ్నాప్ చేసి, చచ్చిపోయిందని కలరిస్తారు. అంతలో అచ్చిబాబుకి తన ఫస్ట్ లవ్ వెంకటలక్ష్మి కనిపిస్తుంది. తన బావ చేసిన అన్యాయంతో మనసు విరిగి, సన్యాసినిగా మారబోతున్న ఆమెను అచ్చిబాబుకు దగ్గర చేస్తారు స్నేహితులిద్దరూ. అంతలో తప్పించుకున్న మల్లీశ్వరి మళ్లీ అచ్చిబాబుని సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. సత్తి బాబు, సూరిబాబుల్ని అరెస్ట్ చేయిస్తుంది. ఇద్దరూ తప్పించుకు వచ్చి అచ్చిబాబుకి వెంకటలక్ష్మితో పెళ్లి చేస్తారు. మల్లీశ్వరి మారి పోయి సూరిబాబుని పెళ్లాడుతుంది. సత్తి బాబు కూడా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడటం క్లయిమాక్స్. ఇదీ ‘తొట్టిగ్యాంగ్’ కథ. అయితే దీన్ని చెప్పుకోవడం కాదు, చూడాలి. సినిమా మొదలైన దగ్గర్నుంచి ముగిసేదాకా నవ్వులే. మల్లీశ్వరి నుంచి తమ ఫ్రెండ్‌ని కాపాడుకోవడానికి మిగతా హీరోలిద్దరూ పడే పాట్లు యమా నవ్విస్తాయి. కథ, కథనం, డైలాగులు అన్నింట్లోనూ కామెడీ వరదలై పొంగి పారుతుంది. అయితే ఈ హాస్యమంతా హాలీవుడ్ సినిమా ‘సేవింగ్ సిల్వర్‌మ్యాన్’ నుంచి తెచ్చుకున్నది. సాధారణంగా సినిమా లైను కాపీ కొట్టేస్తారు. లేదంటే కొన్ని సన్నివేశాలు పట్టుకొస్తారు. కానీ ‘తొట్టిగ్యాంగ్’ సినిమా అచ్చంగా ‘సేవింగ్ సిల్వర్‌మ్యాన్’లాగే ఉంటుంది. అదే కథ, అవే సన్నివేశాలు. చిన్నప్పుడు స్కూల్లో హీరోలు మల్లీశ్వరి చేతిలో తన్నులు తినే సన్నివేశాల నుంచి, క్లయిమాక్స్‌లో పెళ్లి ఆపే సన్నివేశంలో మల్లీశ్వరి, సూరిబాబులు కొట్టుకుని కొట్టు కుని ఒకటైపోవడం వరకూ మ్యాగ్జిమమ్ సీన్లన్నీ మాతృకలోవే. అచ్చిబాబుని కంట్రోల్ చేయడానికి అతడి ఒంటికి కరెంట్ పెట్టడం, మల్లీశ్వరిని పట్టుకోడానికి ట్రాంక్విలైజ్డ్ గన్ని వాడటం వంటివన్నీ కాపీనే. చివరికి హీరోలు వాడే వ్యాన్ కూడా రెండు సినిమాల్లోనూ ఒకలానే ఉంటుంది. అయితే తెలుగులో మల్లీశ్వరి లాయర్. కానీ ఆంగ్లంలో సైకాలజిస్టు. ఇలా కొద్దిపాటి మార్పులే ఉండటం వల్ల కవల పిల్లలకు వేర్వేరు దుస్తులు వేసి నిల బెట్టినట్టుగా అనిపిస్తాయి రెండు చిత్రాలూ.అయితే రెండిటి లోనూ తెలుగు సిని మాయే బెస్ట్ అని బల్ల గుద్ది చెప్పవచ్చు. ఎందు కంటే ఆంగ్లంలో కామెడీ కాస్త అసహజంగాను, రొమాన్స్ కాస్త మితిమీరి నట్టుగాను అనిపిస్తుంది. తెలుగులో అలా లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆంగ్లంలో ముగ్గురు హీరోల్లో ఒకరు గే. మనవాళ్లకు అంతగా ఎక్కని అలాంటి అంశా లను పక్కన పెట్టి, అవసరమైనంత మేరకే తీసుకున్నారు. దాంతో ఆంగ్లంలో అంతగా ఆకట్టుకోని ఈ చిత్రం... తెలుగులో సక్సెస్ బాట పట్టింది. ముఖ్యంగా టపటపా పేలే పంచ్‌లు... అల్లరి నరేష్, ప్రభుదేవా, సునీల్‌ల కామెడీ టైమింగ్ సినిమాకి ప్రాణం పోశాయి. కాపీ సినిమాయే అయినా ఆ విషయం చెప్పుకోవడం అంత అవసరమా అనుకునే విధంగా చిత్రాన్ని మలచిన ఘనత... నూరుశాతం దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణదే!