కాపీకి డెఫినిషన్! | Thotti Gang Music Band | Sakshi
Sakshi News home page

కాపీకి డెఫినిషన్!

Published Sun, Jan 31 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

కాపీకి డెఫినిషన్!

కాపీకి డెఫినిషన్!

అనుసరణ మంచిదే కానీ అనుకరణ మంచిది కాదంటుంటారు పెద్దలు. ఒక్క సారి అనుకరించడం మొదలుపెడితే మనలోని సహజమైన ప్రతిభ మరుగున పడిపోతుందని వారి ఉద్దేశం. అయితే సినీ ఫీల్డ్‌లో ఈ మాటకు విలువ లేదు. అక్కడ అనుకరణ అనేది అతి సహజం. వేరే భాషల్లో విజయం సాధించిన చిత్రాలను అలవోకగా కాపీ కొట్టేయడం మామూలే. అలా అతి తేలికగా కాపీ కొట్టేసిన సినిమాల్లో ‘తొట్టిగ్యాంగ్’ మొదటి వరుసలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది కాపీకి నిర్వచనం. ఎందుకంటే కథో, కథనమో, ఏవో కొన్ని సన్నివేశాలో కాదు... సినిమా మొత్తాన్నీ ఓ ప్యాకేజీగా పట్టుకొచ్చి ఇక్కడ తీసేశారు.
 
 అచ్చిబాబు, సత్తిబాబు, సూరిబాబు చిన్నప్పట్నుంచీ ప్రాణ స్నేహితులు. ముగ్గురూ కలిసి మ్యూజిక్ బ్యాండ్ నడుపుతారు. కుక్కల్ని పట్టుకుంటారు. అంత్యక్రియలు చేస్తారు. బతకడానికి పనికొచ్చే ఏ పనినీ వదలరు. వారి మధ్యలోకి చిన్నప్పటి క్లాస్‌మేట్ మల్లీశ్వరి ప్రవేశిస్తుంది. కరాటే చాంపియన్ అయిన ఆమె చేతిలో వాళ్లు చిన్నప్పుడే దెబ్బలు తినివుంటారు. దాంతో సత్తిబాబు, సూరి బాబులిద్దరికీ ఆమె అంటే భయం, అసహ్యం. కానీ అచ్చిబాబు మాత్రం ఆమె ప్రేమలో పడతాడు. మల్లీశ్వరి అతణ్ని స్నేహితులిద్దరికీ దూరం చేసేసి, నిశ్చి తార్థం చేసుకుంటుంది.
 
  దాంతో కడుపు మండిన ఆ ఇద్దరూ మల్లీశ్వరిని కిడ్నాప్ చేసి, చచ్చిపోయిందని కలరిస్తారు. అంతలో అచ్చిబాబుకి తన ఫస్ట్ లవ్ వెంకటలక్ష్మి కనిపిస్తుంది. తన బావ చేసిన అన్యాయంతో మనసు విరిగి, సన్యాసినిగా మారబోతున్న ఆమెను అచ్చిబాబుకు దగ్గర చేస్తారు స్నేహితులిద్దరూ. అంతలో తప్పించుకున్న మల్లీశ్వరి మళ్లీ అచ్చిబాబుని సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. సత్తి బాబు, సూరిబాబుల్ని అరెస్ట్ చేయిస్తుంది. ఇద్దరూ తప్పించుకు వచ్చి అచ్చిబాబుకి వెంకటలక్ష్మితో పెళ్లి చేస్తారు. మల్లీశ్వరి మారి పోయి సూరిబాబుని పెళ్లాడుతుంది. సత్తి బాబు కూడా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడటం క్లయిమాక్స్.
 
 ఇదీ ‘తొట్టిగ్యాంగ్’ కథ. అయితే దీన్ని చెప్పుకోవడం కాదు, చూడాలి. సినిమా మొదలైన దగ్గర్నుంచి ముగిసేదాకా నవ్వులే. మల్లీశ్వరి నుంచి తమ ఫ్రెండ్‌ని కాపాడుకోవడానికి మిగతా హీరోలిద్దరూ పడే పాట్లు యమా నవ్విస్తాయి. కథ, కథనం, డైలాగులు అన్నింట్లోనూ కామెడీ వరదలై పొంగి పారుతుంది. అయితే ఈ హాస్యమంతా హాలీవుడ్ సినిమా ‘సేవింగ్ సిల్వర్‌మ్యాన్’ నుంచి తెచ్చుకున్నది.
 
 సాధారణంగా సినిమా లైను కాపీ కొట్టేస్తారు. లేదంటే కొన్ని సన్నివేశాలు పట్టుకొస్తారు. కానీ ‘తొట్టిగ్యాంగ్’ సినిమా అచ్చంగా ‘సేవింగ్ సిల్వర్‌మ్యాన్’లాగే ఉంటుంది. అదే కథ, అవే సన్నివేశాలు. చిన్నప్పుడు స్కూల్లో హీరోలు మల్లీశ్వరి చేతిలో తన్నులు తినే సన్నివేశాల నుంచి, క్లయిమాక్స్‌లో పెళ్లి ఆపే సన్నివేశంలో మల్లీశ్వరి, సూరిబాబులు కొట్టుకుని కొట్టు కుని ఒకటైపోవడం వరకూ మ్యాగ్జిమమ్ సీన్లన్నీ మాతృకలోవే. అచ్చిబాబుని కంట్రోల్ చేయడానికి అతడి ఒంటికి కరెంట్ పెట్టడం, మల్లీశ్వరిని పట్టుకోడానికి ట్రాంక్విలైజ్డ్ గన్‌ని వాడటం వంటివన్నీ కాపీనే. చివరికి హీరోలు వాడే వ్యాన్ కూడా రెండు సినిమాల్లోనూ ఒకలానే ఉంటుంది.
 
  అయితే తెలుగులో మల్లీశ్వరి లాయర్. కానీ ఆంగ్లంలో సైకాలజిస్టు. ఇలా కొద్దిపాటి మార్పులే ఉండటం వల్ల కవల పిల్లలకు వేర్వేరు దుస్తులు వేసి నిల బెట్టినట్టుగా అనిపిస్తాయి రెండు చిత్రాలూ.అయితే రెండిటి లోనూ తెలుగు సిని మాయే బెస్ట్ అని బల్ల గుద్ది చెప్పవచ్చు. ఎందు కంటే ఆంగ్లంలో కామెడీ కాస్త అసహజంగాను, రొమాన్స్ కాస్త మితిమీరి నట్టుగాను అనిపిస్తుంది. తెలుగులో అలా లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆంగ్లంలో ముగ్గురు హీరోల్లో ఒకరు గే.
 
  మనవాళ్లకు అంతగా ఎక్కని అలాంటి అంశా లను పక్కన పెట్టి, అవసరమైనంత మేరకే తీసుకున్నారు. దాంతో ఆంగ్లంలో అంతగా ఆకట్టుకోని ఈ చిత్రం... తెలుగులో సక్సెస్ బాట పట్టింది. ముఖ్యంగా టపటపా పేలే పంచ్‌లు... అల్లరి నరేష్, ప్రభుదేవా, సునీల్‌ల కామెడీ టైమింగ్ సినిమాకి ప్రాణం పోశాయి. కాపీ సినిమాయే అయినా ఆ విషయం చెప్పుకోవడం అంత అవసరమా అనుకునే విధంగా చిత్రాన్ని మలచిన ఘనత... నూరుశాతం దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణదే!      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement