Kalyan Ram Love Proposal To Heroine Ashika Ranganath In A TV Show, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Kalyan Ram : హీరోయిన్‌ ఆషికకు ప్రపోజ్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌!

Published Mon, Feb 6 2023 1:33 PM

Kalyan Ram Love Proposal To Heroine Ashika Ranganath In A Show - Sakshi

బింబిసార బ్లాక్‌ బస్టర్‌ తర్వాత కల్యాణ్‌ రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం అమిగోస్‌. ఆషిక రంగనాథ్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 10న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఇక రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ జోరు పెంచారు మేకర్స్‌.

ఈ క్రమంలో బుల్లితెరపై ఓ షోకు గెస్టుగా విచ్చేసిన కల్యాణ్‌ రామ్‌ ఓ ఫన్నీ టాస్క్‌లో భాగంగా హీరోయిన్‌ ఆషికకు లవ్‌ ప్రపోజ్‌ చేశారు.‘మీకోసం చాలా రోజుల నుంచి వెయిట్‌ చేస్తున్నాను’ అంటూ రెడ్‌ రోజ్‌ ఇచ్చి క్యూట్‌గా ప్రపోజ్‌ చేశారు. ఆ తర్వాత సుమ అప్పుడే రావడంతో.. మీరు ఇంకా బాగున్నారు అంటూ ఆమె చేతికి అందమైన రోజా పువ్వును ఇచ్చారు కల్యాణ్‌ రామ్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.   

Advertisement
 
Advertisement
 
Advertisement