లైంగిక విద్యను నిషేధించాలని తానెప్పుడూ ప్రతిపాదించలేదని కేంద్ర ఆరో్గ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు.
న్యూఢిల్లీ: లైంగిక విద్యను నిషేధించాలని తానెప్పుడూ ప్రతిపాదించలేదని కేంద్ర ఆరో్గ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. పాఠశాలల్లో లైంగిక విద్యను నిషేధించాలంటూ ప్రతిపాదన చేసినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.
తన వెబ్సైట్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమని హర్షవర్ధన్ చెప్పారు. కౌమార దశ విద్యా పథకాన్నియథారూపంలో ప్రవేశపెట్టాలన్న యూపీఏ ప్రభుత్వ నిర్ణయంపై తన అభిప్రాయాలను తెలియజేశానని అన్నారు. శాస్త్రీయంగా, సాంస్కృతికంగా ఆమోదయోగ్యమైన లైంగిక విద్యకు ఓ మెడికల్ ప్రొఫనల్గా మద్దతు తెలుపుతానని చెప్పారు.