న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్థుల ఆహార భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల క్యాంటిన్లలో అనారోగ్యమైన లేదా చిరుతిళ్లను నిషేధించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ యోచిస్తున్నారు. పిల్లలకు ఈ విషయంపై అవగాహన కల్పించడంతో పాటు క్యాంటిన్లలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలతో మేనకా గాంధీ ఈ విషయంపై చర్చించనున్నారు. మధ్యాహ్న భోజన పథకం మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తుంది.
స్కూల్ క్యాంటిన్లలో చిరుతిళ్లు నిషేధించే యోచన
Published Wed, Jun 4 2014 8:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement