
బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ చివరి చిత్రం ‘అంగ్రేజీ మీడియం’. ఈ మూవీకి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిలీం ఫేర్ అవార్డుతో పాటు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి అవార్డులను తీసుకునేందుకు ఇర్ఫాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఆయన దుస్తుల్లో హజరయ్యాడు. అయితే అది చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఈ సందర్బంగా బాబిల్ నేను ఆయన నటనకు సరితూగకపోవచ్చు కానీ ఆయన దుస్తులకు సరిపోతానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.
అయితే అవార్డు కార్యక్రమానికి వెళ్లేముందు తల్లి సుతాప సిక్ధార్ ఇర్ఫాన్ సూట్ వేసి ముస్తాబు చేస్తున్న వీడియోను బాబిల్ షేర్ చేశాడు. తల్లి సుతాప తన తండ్రి షూట్‌నే ఎందుకు వేయించింది, అలాగే ఆమె అవార్డు ఫంక్షన్స్‌కు రాకపోవడానికి కారణం ఎంటో బాబిల్ తన పోస్టులో చెప్పుకొచ్చాడు. ‘నాన్నకు(ఇర్ఫాన్ ఖాన్) ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్‌లో పాల్గొనడం అస్సలు నచ్చదు. కానీ ఆయన కొన్ని సార్లు చేయాల్సి వచ్చేది. అందుకే తన సౌకర్యాన్ని బ్రేక్ చేసుకునేందుకు ఇలాంటి నీలి రంగు దుస్తులనే ధరించేవారు. నిన్న రాత్రి నేను చేసింది కూడా అదే.
నేను కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అసౌకర్యానికి గురవుతుంటాను’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అలాగే ఈ వీడియో చివరలో బాబిల్ తన తల్లిని నువ్వు కూడా అవార్డు ఫంక్షన్‌కు రావచ్చు కదా అని అడగ్గా ఆమె ‘నేను రాలేను.. ఎందుకంటే అక్కడ మనుషులను ఫేస్ చేయలేను’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. కాగా గతేడాది ఏప్రిల్ 29న ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బాబిల్ తండ్రికి సంబంధించిన విషయాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్యేగానికి లోనవుతుంటాడు.
చదవండి:
Filmfare Awards 2021: విజేతలు వీరే..
సీబీడీ ఆయిల్‌ను లీగల్ చేయాలి: ఇర్ఫాన్ భార్య
Comments
Please login to add a commentAdd a comment