ఈ శతాబ్దపు ఉత్తమ నటీనటుల జాబితాను ప్రముఖ ఆంగ్ల పత్రిక ది ఇండిపెండెంట్ వెల్లడించింది. 21 వ శతాబ్దంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దాదాపు 60 మందితో కూడిన సినీ నటుల పేర్లను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటుల పేర్లను ఇందులో చేర్చింది. అయితే భారత్ నుంచి ఏ ఒక్క స్టార్ హీరో లేకపోవడం గమనార్హం. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా ఈ లిస్ట్‌లో చోటు లభించలేదు.
అయితే ఈ 60 ఉత్తమ నటీనటుల జాబితాలో ఇండియా నుంచి ఒక్క నటుడు మాత్రం స్థానం దక్కించుకున్నాడు. అతను మరెవరో కాదు.. విభిన్నమైన పాత్రలతో మెప్పించిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే ఈ జాబితాలో నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఈ ప్రపంచంలో లేరు. 2020లో ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన చనిపోయాక అరుదైన జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
ఇర్ఫాన్ ఖాన్ సినీ ప్రయాణం..
రాజస్థాన్‌లోని పఠాన్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ ఖాన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటన నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ముంబయికి వెళ్లిపోయారు. ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్‌లో లైఫ్ ఇన్ ఎ మెట్రో, ది డార్జిలింగ్ లిమిటెడ్, స్లమ్‌డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమర్, లైఫ్ ఆఫ్ పై, ది లంచ్‌బాక్స్, కిస్సా, హైదర్, పికు, తల్వార్, హిందీ మీడియం, ది సాంగ్ ఆఫ్ స్కార్పియన్స్, ఖరీబ్ ఖరీబ్ సింగ్లే, కార్వాన్, ఆంగ్రేజీ మీడియం లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు. తను చివరగా నటించిన ‘అంగ్రేజీ మీడియం’ షూటింగ్‌లోనూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో కొన్నాళ్లపాటు విరామం తీసుకుని మళ్లీ చిత్రీకరణ పూర్తి చేశారు.
టాప్ 10 నటులు వీళ్లే..
2014లో మరణించిన మరో దివంగత నటుడు ఫిలిప్ సేమౌర్ హాఫ్‌మన్ 21వ శతాబ్దపు ఉత్తమ నటుడిగా నిలిచారు. నటీమణుల్లో ఎమ్మా స్టోన్ 2వ స్థానం దక్కించుకుంది. క్రేజీ, స్టుపిడ్, లవ్, లా లా ల్యాండ్, ది ఫేవరెట్, పూర్ థింగ్స్ లాంటి చిత్రాల్లో నటనకు ఆమె ప్రశంసలు అందుకుంది. 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన డేనియల్ డే-లూయిస్ 3 స్థానంలో నిలిచాడు. ది గ్లాడియేటర్ II నటుడు డెంజెల్ వాషింగ్టన్ 4వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నికోల్ కిడ్మాన్, డేనియల్ కలుయుయా, సాంగ్ కాంగ్ హో, కేట్ బ్లాంచెట్, కోలిన్ ఫారెల్, ఫ్లోరెన్స్ పగ్ వరుసగా స్థానాల్లో నిలిచారు. ఇండియా నుంచి కేవలం ఇర్ఫాన్ ఖాన్‌కు మాత్రమే ప్లేస్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment