Indian actor
-
వాళ్లను బాధపెట్టకూడదనే నేను పెళ్లి చేసుకోలేదు క్లారిటీ ఇఛ్చిన ప్రభాస్
-
అన్ని ఈవెంట్లు ఒక లెక్క బుజ్జి ఈవెంట్ మరో లెక్క ఇది ప్రభాస్ రేంజ్
-
రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?
ప్రపంచంలో అత్యంత లాభదాయకమైనచలనచిత్ర పరిశ్రమగా ఇండియన్ సినిమాలు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసు దోచుకుంటూ, బాక్సీఫీసు వద్ద వేల కోట్ల రాబడులను సాధిస్తున్నాయి. ఇటివల కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ బాబు, విజయ్, రజనీకాంత్ లాంటి హీరోలు సినిమాకు వన్నెతెచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ ఫీజు కొన్నిసార్లు సినిమా మొత్తం బడ్జెట్‌ను మించిపోతోందంటే వీరి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బాలీవుడ్లో సౌత్ ఇండియాలో సినిమాకు 100కోట్ల రూపాయలకుపైగా వసూలు చేస్తున్న టాప్ స్లార్లు చాలామందే ఉన్నారు. ఆశ్చర్యకరంగా బాలీవుడ్ బిగ్ స్టార్ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న నటుడు ఎవరో తెలుసా? సల్మాన్, షారూఖ్, అక్షయ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ కాకుండా సినిమాకి 200 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ యాక్టర్‌గా కోలీవుడ్ స్టార్ హీరో రికార్డ్ క్రియేట్ చేశాడని టాక్. (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ) తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో. తాజా నివేదికల ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ లియో సినిమాకు రూ. 200 కోట్లు వసూలు చేశాడట. దీనిపై ఇంకా పూర్తి ధృవీకరణ రానప్పటికీ హైయ్యస్ట్ పెయిడ్ హీరో అని టాక్ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. విజయ్ 2021లో వచ్చిన 'మాస్టర్' సినిమాకు 80 కోట్లు, బీస్ట్, వారసుడు సినిమాలకు 100 కోట్లు వసూలు చేశాడని టాక్. తాజాగా దీన్ని రెట్టింపు చేశాడన్నట్టు. 48 ఏళ్ల విజయ్ 27 సంవత్సరాల క్రితం తన నటుడిగా పరిచయం అయ్యాడు. సుమారు 66 చిత్రాలలో ప్రధాన పాత్రల్లో అభిమానులను అలరించాడు స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రేమగా 'జో' అని పిలుచుకునే విజయ్ దళపతి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) విజయ్ ప్రస్తుతం ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న లియో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్-థ్రిల్లర్ మూవీ లియోలో విజయ్ సరసరన త్రిష కృష్ణన్ నటిస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా ప్రియా ఆనంద్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్ తదితరులు నటిస్తున్నారు. 49వ పుట్టినరోజు సందర్భంగా లియో టీమ్ విజయ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో దళపతి విజయ్ నటిస్తున్న లియో మూవీ ఫస్ట్ లుక్ అదిరి పోవడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలాగే 'దళపతి 68'లో వెంకట్ ప్రభుతో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై పూర్తి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. -
స్పేస్ ఎక్స్ ‘చంద్రయాన్’లో భారత నటుడు దీప్ జోషి
వాషింగ్టన్: ‘డియర్ మూన్’ పేరుతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు వెళ్లే బృందంలో బాల్వీర్ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్ సాధించిన భారత నటుడు దీప్ జోషి చోటు దక్కించుకున్నారు! చంద్రుని సమీపానికి స్పేస్ ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించినా చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర పాటు అనేకానేక వడపోతల అనంతరం జోషితో పాటు ప్రఖ్యాత బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కరీం ఇలియా, అమెరికా నుంచి ప్రముఖ డీజే, నిర్మాత స్టీవ్ అవోకీ, సినీ దర్శకుడు బ్రెండన్ హాల్, యూట్యూబర్ టిమ్ డాడ్, దక్షిణ కొరియాకు చెందిన కె–పాప్ మ్యుజీషియన్ షొయ్ సెయంగ్ హుయాన్ (టాప్) విజేతలుగా నిలిచారు. వీరంతా వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ వెహికిల్‌లో మజావాతో పాటు 8 రోజుల పాటు అంతరిక్షంలో విహరిస్తారు. 3 రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతారు. 22 ఏళ్ల జోషి ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడు. 2000 నవంబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టారు. పలు గుజరాతీ సినిమాల్లో నటించారు. ‘‘దేవ్ యువోత్సాహం తమకెంతో స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన్ను ఎంపిక చేసుకున్నాం’’ అని మజావా పేర్కొన్నారు. -
ఆడా ఉంటా.. ఈడా ఉంటా!
‘‘కళను, కళాకారులను ఒక భాషకి, ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అంటారు. నిజమే.. కళాకారులకు ఎల్లలు ఉండవు. ఆర్టిస్ట్‌గా నేను ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో పరిమితం కావాలనుకోవడంలేదు’’ అంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారామె. తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు) అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, హిందీలో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణ్వీర్ సింగ్‌తో ‘సర్కస్’ చేస్తున్నారు. ఇలా రెండు భాషల్లో బిజీబిజీగా ఉండటం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తెలుగు ప్రేక్షకులు నా మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నన్ను ఎంతగానో ఆదరించారు. చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తున్నా. ఒకేసారి రకారకాల భాషల సినిమాల్లో, వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం మంచి అనుభవం. సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే. నేను ఏదో ఒక భాషకు చెందిన నటిగా కంటే ఇండియన్ యాక్టర్ అనిపించుకోవాలనుకుంటున్నాను. అదే నాకిష్టం’’ అన్నారు. ప్రస్తుతం చేస్తున్న తెలుగు సినిమాల షెడ్యూల్స్ గురించి చెబుతూ – ‘‘ఈ 25 వరకూ ‘రాధేశ్యామ్’ షూట్లో పాల్గొని, ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూట్లో జాయిన్ అవుతా. జనవరి నుంచి మళ్లీ ‘రాధే శ్యామ్’ సెట్లో ఉంటా’’ అన్నారు పూజా. సో.. పూజా ఆడా ఉంటా.. ఈడా.. ఉంటా అంటున్నారన్న మాట. మంచిదేగా!