![Babil Khan Locked Himself In Room After Dad Irrfan Demise - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/7/irfan-khan.jpg.webp?itok=0XIhIPW0)
దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ బర్త్‌డే నేడు (జనవరి 7). తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న ఆయన 2020లో కన్నుమూశారు. క్యాన్సర్ మహమ్మారితో చేసిన దీర్ఘకాలం పోరాటంలో తనువు చాలించారు. ఆ సమయంలో ఇర్ఫాన్ కుటుంబం, అభిమానులు పడ్డ బాధ మాటల్లో చెప్పలేనిది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఇర్ఫాన్ పెద్ద కొడుకు బాబిల్ ఖాన్ కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు.
'నాన్న మా మధ్య లేడన్న విషయాన్ని నేను నమ్మలేకపోయాను. కానీ వారం రోజుల తర్వాత నాన్న లేని ఎడబాటు మమ్మల్ని కుంగదీసింది. నేనైతే ఆ బాధతో నెలన్నర రోజుల పాటు గదిలోకి వెళ్లి తాళం వేసుకుని అందులోనే ఉండిపోయాను. మామూలుగా నాన్న లాంగ్‌డేస్ షూటింగ్ షెడ్యూల్స్‌కు వెళ్తూ ఉండేవాడు. ఇది కూడా అలాంటిదేనేమో.. వచ్చేస్తాడేమో అనిపించేది.. కానీ ఎప్పటికీ తిరిగి రాడని అర్థమయ్యాక నా బెస్ట్ ఫ్రెండ్‌ను కోల్పోయాననిపించింది. ఎంతో నరకం అనుభవించాను' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
క్వాలా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు బాబిల్. ప్రస్తుతం అతడు 'ద రైల్వే మెన్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఆర్.మాధవన్, కేకే మీనన్, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. భోపాల్ గ్యాస్ విషాద ఘటన ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇకపోతే శూజిత్ సర్కార్‌తో మరో సినిమా కూడా చేస్తున్నాడు బాబిల్.
చదవండి: విక్రమార్కుడు తర్వాత నన్ను ఇంట్లో దారుణంగా చూశారు: అజయ్
నా తండ్రితోనే పెళ్లి చేస్తున్నారు.. ఎంత ఘోరం?: శ్రీముఖి
Comments
Please login to add a commentAdd a comment