మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు! | Irfan Son Ayaan Shares A Photo Of Bike Riding With Father | Sakshi
Sakshi News home page

మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు!

Published Sat, May 2 2020 3:49 PM | Last Updated on Sat, May 2 2020 4:50 PM

Irfan Son Ayaan Shares A Photo Of Bike Riding With Father - Sakshi

తండ్రి ఇర్ఫాన్‌తో అయాన్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ చనిపోయి రోజులు గడుస్తున్నా జ్ఞాపకాలతో తమ వెంటే ఉన్నాడని భావిస్తోంది కుటుంబం. ఏదో ఒక విషయంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో చిన్న కుమారుడు అయాన్‌ తండ్రి ఇర్ఫాన్‌తో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. తండ్రి బైక్‌ నడుపుతుండగా అయాన్‌ తలపై టోపీతో ముందు కూర్చుని ఉన్న ఫొటో అది. ఫొటోతో పాటు తండ్రి బ్రతికుండగా ... ‘‘మనిషిగా ఈ భూమ్మీద పుట్టడం ఓ వరం.. అదేమీ శాశ్వతం కాదు’’ అన్న మాటల్ని కూడా అయాన్‌ గుర్తు చేసుకున్నాడు. గురువారం ఇర్ఫాన్‌ భార్య సుతాపా సిక్‌దర్‌ స్పందిస్తూ.. భర్త మరణంపై భావోద్వేగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయాన్‌ తల్లి లేఖను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.

చదవండి : నేను ఒంటరిని ఎలా అవుతా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement