తొలి అడుగే అదరగొట్టేశాడుగా : వైరల్‌ పిక్స్‌ | Prior to Bollywood entry Babil Khan first photoshoot:Viral Pics | Sakshi
Sakshi News home page

Babil Khan: తొలి అడుగే అదరగొట్టేశాడుగా : వైరల్‌ పిక్స్‌

Published Fri, Nov 12 2021 1:58 PM | Last Updated on Fri, Nov 12 2021 3:21 PM

Prior to Bollywood entry Babil Khan first photoshoot:Viral Pics - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ తండ్రి మరణం తరువాత తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. త్వరలోనే బాలీవుడ్‌ మూవీ ద్వారా ఫ్యాన్స్‌ ముందుకు రానున్న బాబిల్‌ ఒక ఫోటోషూట్‌ చేశాడు. డెబ్యూకు ముందు చేసిన ఫోటోషూట్‌తోనే అదరగొట్టేశాడు.  ఈ ఫోటోలు  విపరీతంగా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. 

నాసిక్‌లో ఫామ్‌హౌస్‌ తన కుటుంబానికి ప్రత్యేకమైన ప్రదేశమని, ముఖ్యంగా తండ్రి ఇర్ఫాన్‌ ఖాన్‌  విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఇక్కడికే వచ్చేవారని తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు బాబిల్‌. చదువుకు స్వస్తి చెప్పి నటుడిగా కరియర్‌ను ప్రారంభించ నున్నట్టు ప్రకటించిన బాబిల్‌ ఈ అద్భుత ఫోటోషూట్‌తో హల్‌చల్‌ చేస్తున్నాడు. ఇషా భన్సాలీ స్టైల్, శివాజీ సేన్ ఫోటోగ్రఫీలో తన తండ్రికిష్టమైన ఫామ్‌హౌస్‌లో చేసుకున్న మొదటి ఫోటోషూట్  స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.  

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాబిల్‌ తన  ఫాలోవర్స్‌తో తన అభిప్రాయాలను షేర్‌ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా తనకే మతమూ లేదని తానూ అందరి లాంటి వాడినేని ప్రకటించుకున్నాడు. దేశంలో అందరి పౌరుల్లాగానే తాను కూడా ఒక​ భారతీయుడినని చెప్పుకొచ్చిన బాబిల్‌ ప్రజల్ని ప్రేమిస్తాను, ప్రజల కోసం నిలబడతానని ఇన్‌స్టాగ్రామ్ తన ఫ్యాన్‌కు సమాధానం ఇచ్చాడు. లండన్, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్న బాబిల్‌ యాక్టింగ్‌వైపు వస్తున్నట్టు ఇటీవల ప్రకటించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement