Tollywood Film Fare Awards 2022: హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో టాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ కె. కళా సాంసృతిక ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఆర్. కె.రంజిత్ చేపడుతున్నారు. అయితే నేషనల్ గా సైమా అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఉన్నట్టు తెలుగు సినిమారంగానికి ఎటువంటి అవార్డ్స్ లేవని గుర్తించిన ఆయన ఈ అవార్డ్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. సినిమారంగంలో ఉత్తమ ప్రతిభను కనబరచిన వారికి ఈ బహుమతి అందిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దైవజ్ఞ శర్మ, దర్శకుడు సముద్ర, జస్టిస్ డా. బి. మధు సూదన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, సీనియర్ ఆర్టిస్ట్ హేమలత చౌదరి చేతులమీదుగా అవార్డ్స్‌ను ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో అనేక మంది నటీనటులకు మెమోంటోలను ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు నగేష్ నారదాసి,నటుడు కె. యల్ నరసింహారావు, నిర్మాత మూస అలీ ఖాన్, నటుడు ఆర్. మాణిక్యం, నటులు సమ్మెట గాంధీ, షేకింగ్ శేషు, చిత్రం బాషా లతో పాటు అనేక మంది నటీ నటులు పాల్గొన్నారు.
చదవండి: పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్
షూటింగ్స్ బంద్‌పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''టాలీవుడ్ ఫిలిం అవార్డ్స్ 2022 పేరు మీదుగా అవార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా రెండు రాష్టాల ప్రభుత్వ సహకారం తీసుకొని రెండు సంవత్సరాలకు సంబందించిన సినిమాలకు టి.యఫ్.సి.సి నంది అవార్డ్స్ పేరుతో.. డిసెంబర్‌లో అవార్డ్స్ కార్యక్రమం చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇందులో సినిమా రంగానికే కాకుండా ఇతర రంగాలలో ప్రతిభ చూపిన వారికీ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇప్పటివరకు తెలంగాణలో నంది అవార్డ్స్ లేవు కాబట్టి ఇప్పుడు చేసే అవార్డ్స్ ఫంక్షన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాము. అమితాబచ్చన్‌తో మాట్లాడాము. ఆయనకు కూడా లైఫ్ టైమ్ ఆచీవ్ మెంట్ అవార్డ్ ఇస్తున్నాం'' అని పేర్కొన్నారు.
చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment