టెన్షన్‌ లేదు! | Deepika Padukone no longer a part of Vishal Bhardwaj's film | Sakshi
Sakshi News home page

టెన్షన్‌ లేదు!

Published Tue, Oct 9 2018 5:16 AM | Last Updated on Tue, Oct 9 2018 5:16 AM

Deepika Padukone no longer a part of Vishal Bhardwaj's film - Sakshi

దీపికా పదుకోన్‌

‘పద్మావత్‌’ సినిమా రిలీజ్‌ అయి పది నెలలు కావస్తున్నా ఇంకా ముఖానికి మేకప్‌ వేసుకోలేదు దీపికా పదుకోన్‌. విశాల్‌ భరద్వాజ్‌ సినిమాలో యాక్ట్‌ చేయాల్సి ఉన్నప్పటికీ ఇర్ఫాన్‌ ఖాన్‌ అనారోగ్యం కారణంతో ఆ సినిమా ఆగిపోయింది. మేఘన్‌ గుల్జర్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం అవుతుందట. ఇప్పుడు మరో సినిమాకు దీపిక ‘యస్‌’ చెప్పినట్టు సమాచారం.

లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్, రణ్‌బీర్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న ఓ చిత్రంలో రణ్‌బీర్‌తో కలసి యాక్ట్‌ చేయనున్నారట. ఆల్రెడీ ఈ ఇద్దరూ ‘బచ్‌నా ఏ హసీనో, ఏ జవానీ హే దివానీ, తమాషా’ సినిమాల్లో కలసి నటించిన సంగతి తెలిసిందే. రణ్‌వీర్‌తో పెళ్లి తర్వాత దీపిక సెట్లోకి అడుగుపెట్టబోయేది ఈ సినిమానే అట. ఇది వరకు రణ్‌బీర్, దీపిక ప్రేమలో పడి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే రణ్‌వీర్, దీపికల పెళ్లి నవంబర్‌ లేక రానున్న జనవరిలో ఉంటుందట. ప్రస్తుతానికి దీపిక ఖాళీగా ఉన్నారు కాబట్టి టెన్షన్‌ లేకుండా పెళ్లి పనులు చూసుకుంటున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement