Vishal Bharadwaj
-
ఫ్రాంచైజీలుగా రాబోతున్న టబు ‘ఖూఫియా’
ఈ మధ్య కాలంలో సీక్వెల్ అనేది కామన్ అయిపోయింది. ఒక సినిమా హిట్ అయిందంటే చాలు దానికి సీక్వెల్ తీసుకొస్తున్నారు. పార్ట్ 1, 2,3 అంటూ ఫ్రాంచైజీలుగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఫ్రాంచైజీ అంటే ఒక సినిమా కథలోని పాత్రలు తీసుకొని..ఇంకో కథలా మార్చి..చూపించడమే. దాన్నే మన భాషలో సీక్వెల్ అని అంటాం. గతంలో హాలీవుడ్లో మాత్రమే ఫ్రాంచైజీ మూవీస్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఇండియన్ చిత్రాల్లో కూడా ఫ్రాంచైజీ కల్చర్ వచ్చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్ జోరు నడుస్తోంది. హిట్ మూవీలకు వెంటనే పార్ట్ 2 వచ్చేస్తుంది. తాజాగా మరో చిత్రం కూడా ఫ్రాంచైజీలుగా రావడానికి సిద్ధమైంది. అదే ‘ఖూఫియా’. అలనాటి అందాల తార టబు నటించిన స్పై థ్రిల్లర్ సినిమా ఇది. విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. విశాల్ మేకింగ్, టబు యాక్టింగ్‌పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఏడాదికో ‘ఖూఫియా’ టబు, అలీ ఫజల్, హాట్ బ్యూటీ వామిగా గబ్బి, ఆశీష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖుఫియా’. అమర్ భూషణ్ రచించిన 'ఎస్కేప్ టు నో వేర్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విశాల్ భరద్వాజ్. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో.. ఫ్రాంచైజీలుగా తీసుకురావాలని భావిస్తున్నాడట దర్శకుడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా విశాల్ భరద్వాజే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘ఖూఫియా’ ఫ్రాంచైజీలుగా తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలోని కృష్ణ మెహ్రా పాత్రతో ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై ఏడాదికొక ‘ఖుఫియా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను’అని విశాల్ భరద్వాజ్ చెప్పుకొచ్చాడు. అంటే త్వరలోనే ‘ఖుఫియా 2’ రాబోతుందన్నమాట. ‘ఖూఫియా’ కథేంటి? కృష్ణ మెహ్రా అలియాస్ కేఎం (టబు), జీవ్ ( ఆశిష్ విద్యార్థి) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ‘రా’ అధికారులు. ఢిల్లీలోని ‘రా’ ప్రధాన కార్యాలయంలో పనిచేసే రవి మోహన్ (అలీ ఫాజిల్)..అక్కడి సమాచారాన్ని ఉగ్రవాద సంస్థలకు చేరవేస్తున్నట్లు జీవ్ అనుమానిస్తాడు. అతనిపై నిఘా పెట్టాలని కేఎంను ఆదేశిస్తాడు. పై అధికారి ఆదేశంతో కేఎం ‘ఆపరేషన్ బ్రూటస్’పేరుతో రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో కేఎం బృందానికి ఎదురైన సమస్యలు ఏంటి? జీవ్ అనుమానించినట్లు రవి నిజంగానే ఉగ్రసంస్థలకు సమాచారం చేరవేశాడా? రవి దేశ ద్రోహ చర్యల వెనుక ఉన్నదెవరు? ఈ మోసంలో రవి భార్య చారు(వామికా గబ్బీ) హస్తం ఉందా? హీనా రెహమాన్(అజ్మేరీ), కేఎంకు ఉన్న సంబంధం ఏంటి? హీనాను హత్య చేసిందెవరు? కేఎం నేపథ్యం ఏంటి? ‘ఆపరేషన్ బ్రూటస్’ ఏ మేరకు సక్సెస్ అయింది అనేది తెలియాలంటే ‘ఖూఫియా’ సినిమా చూడాల్సిందే. ‘రా’ ఎలా పని చేస్తుందో వివరించే కథ ఇది. -
'కాంబినేషన్ రిపీట్'..చాలా ఎగై్జటింగ్‌గా ఉంది: టబు
‘‘మళ్లీ వీబీ (విశాల్ భరద్వాజ్) కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నా మనసుకి బాగా దగ్గరైన అద్భుతమైన స్పై థ్రిల్లర్ ఇది. మిమ్మల్ని (ప్రేక్షకులు) ఫుల్‌గా థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా టబు పేర్కొన్నారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘మక్బూల్’, హైదర్’ వంటి చిత్రాల్లో టబు నటించారు. ఈ చిత్రాలు నటిగా ఆమెకు మరింత మంచి పేరు తెచ్చాయి. అయితే ఈసారి విశాల్‌తో కలిసి టబు చేయనున్నది సినిమా కాదు.. వెబ్ సిరీస్. ‘ఖుఫియా’ టైటిల్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌లో అలీ ఫజల్, ఆశిష్ విద్యార్థి, వామికా గబ్బీ ఇతర ప్రధాన పాత్రధారులు. ఢిల్లీలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందనుంది. అమర్ భూషణ్ రాసిన ‘ఎస్కేప్ టు నౌహియర్’ నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. భారతీయ గూఢచారి సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)లో పని చేసే కృష్ణ మెహ్రా చుట్టూ ముఖ్యంగా ఈ కథ సాగుతుంది. భారతదేశ రక్షణ రహస్యాలను విక్రయించే ఓ ముఠాను పట్టుకునే పనిని కృష్ణకి అప్పగిస్తారు. ఒకవైపు ఈ బాధ్యత, మరోవైపు ప్రియురాలిగా కృష్ణ పాత్ర సాగుతుంది. ఈ పాత్రనే టబు చేయనున్నారు. -
రాత్రి ఒంటరిగా ఉంది!
బాలీవుడ్లో ప్రస్తుతం మంచి స్పీడ్‌తో దూసుకెళ్తోన్న యాక్టర్స్‌లో నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఒకరు. హీరోగాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించడానికి ఆలోచించరు నవాజ్. కథే అయనకు ముఖ్యం. ఇప్పుడు ఆయన హీరోగా ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. హనీ తెహ్రాన్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు ‘రాత్ అఖేలీ హై’ (రాత్రి ఒంటరిగా ఉంది) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని టాక్. ఇంతకు ముందు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మక్బూల్, ఓమ్కార, సాథ్ ఖూన్ మాఫ్’ సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు హనీ. అలాగే ఈ సినిమాలో కథానాయిక పాత్రకు రాధికా ఆప్టేను తీసుకున్నారు. మూడేళ్ల క్రితం నవాజ్, రాధిక కలిసి ‘మాంఝు: ది మౌంటెన్ మ్యాన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా కోసం జత కట్టారు రాధిక, నవాజ్. ప్రస్తుతం సౌత్‌లో రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న ‘పేట్టా’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు నవాజ్. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
టెన్షన్ లేదు!
‘పద్మావత్’ సినిమా రిలీజ్ అయి పది నెలలు కావస్తున్నా ఇంకా ముఖానికి మేకప్ వేసుకోలేదు దీపికా పదుకోన్. విశాల్ భరద్వాజ్ సినిమాలో యాక్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం కారణంతో ఆ సినిమా ఆగిపోయింది. మేఘన్ గుల్జర్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం అవుతుందట. ఇప్పుడు మరో సినిమాకు దీపిక ‘యస్’ చెప్పినట్టు సమాచారం. లవ్ రంజన్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, రణ్‌బీర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న ఓ చిత్రంలో రణ్‌బీర్‌తో కలసి యాక్ట్ చేయనున్నారట. ఆల్రెడీ ఈ ఇద్దరూ ‘బచ్నా ఏ హసీనో, ఏ జవానీ హే దివానీ, తమాషా’ సినిమాల్లో కలసి నటించిన సంగతి తెలిసిందే. రణ్వీర్తో పెళ్లి తర్వాత దీపిక సెట్లోకి అడుగుపెట్టబోయేది ఈ సినిమానే అట. ఇది వరకు రణ్‌బీర్, దీపిక ప్రేమలో పడి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే రణ్వీర్, దీపికల పెళ్లి నవంబర్ లేక రానున్న జనవరిలో ఉంటుందట. ప్రస్తుతానికి దీపిక ఖాళీగా ఉన్నారు కాబట్టి టెన్షన్ లేకుండా పెళ్లి పనులు చూసుకుంటున్నారట. -
వండర్ ఉమెన్
దీపికా పదుకోన్ ‘పద్మావతి’గా థియేటర్స్‌లోకి వచ్చి దాదాపు ఐదు నెలలు కంప్లీట్ అయ్యాయి. నెక్ట్స్ ఆమె చేయబోయే సినిమా ఏంటి? అనుకుంటున్న టైమ్‌లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో నటించనున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇందులో హీరోగా నటించాల్సిన ఇర్ఫాన్‌ఖాన్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది. దీంతో దీపికా నెక్ట్స్ సినిమాపై మళ్లీ డౌట్స్ మొదలయ్యాయి. అయితే.. ఇప్పుడు ఆమె సూపర్ హీరోస్ మాదిరి వండర్ ఉమెన్‌లా ఓ సినిమాలో నటించబోతున్నారని బీటౌన్ లేటెస్ట్ ఖబర్. అంతేకాదు.. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టు పార్ట్స్‌గా రాబోతుందట. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళితే.. వండర్ ఉమెన్ బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్లో నటించబోయే తొలి హీరోయిన్ దీపికానే అవుతుందని టాక్. మరి.. వండర్ ఉమెన్‌లా దీపికా చేయబోయే వండర్స్ ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడాలంటే మాత్రం చాలా టైమ్ ఉంది. ఇక.. రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్ ఈ ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
అక్క ఎక్కడ?
కృతీ సనన్‌కి ఒక చెల్లెలు ఉన్నారు. పేరు నూపుర్ సనన్. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పార్టీలు చేసుకున్న ఫొటోలు, షికారుకెళ్లినప్పుడు దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు కృతీ తన అక్క ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారట. చిన్నప్పుడు తిరనాళ్లల్లో ఆమె అక్క తప్పిపోయారనుకుంటున్నారా? అదేం కాదు. కృతీ తెలుసుకోవాలనుకుంటున్నది ఆన్ స్క్రీన్ తన అక్కగా నటించబోయే అమ్మాయి గురించి. ‘‘నా అక్క ఎవరో త్వరగా చెప్పండి. తనతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి’’ అని దర్శకుడు విశాల్ భరద్వాజ్‌ను సతాయిస్తున్నారట కృతి. ‘‘సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్, వాణీ కపూర్, భూమి పెడ్నేకర్‌ని సంప్రదించాను. ఇంకొన్ని పేర్లు అనుకుంటున్నాను. మీ అక్కయ్యను త్వరలోనే ఫైనలైజ్ చేస్తా’’ అని కృతీ సనన్‌ను బుజ్జగిస్తున్నారట విశాల్. అక్కాచెల్లెళ్ల గొడవలను బేస్ చేసుకుని బాలీవుడ్లో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు దర్శకుడు విశాల్ భరద్వాజ్. హిందీలో ‘హైదర్, రంగూన్’ వంటి చిత్రాలను రూపొందించారాయన. తన తాజా చిత్రంలో చెల్లెలి పాత్రకు కృతీ సనన్ ఓకే చేశారు. మరి.. కృతి అక్క ఎవరో వేచి చూద్దాం. -
లేడీ డాన్‌గా దీపిక
బాలీవుడ్ లో వరుస విజయాలతో స్టార్ హీరోలకు పోటి ఇస్తున్న దీపిక పదుకొణె మరో ఆసక్తికరమైన సినిమాలో నటించనుంది. ముంబైని గడగడలాండించిన లేడీ డాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో దీపిక నటించనుంది. 80లలో ముంబయికి చెందిన మాఫియా క్వీన్ సప్నా దీదీ జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సప్నా దీదీగా దీపిక నటించనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పీకు సినిమాతో సక్సెస్ఫుల్ పెయిర్ అనిపించుకున్న దీపిక పదుకొణె, ఇర్ఫాన్ ఖాన్ లు ఈ బయోపిక్ కోసం మరోసారి జోడికడుతున్నారు. ప్రస్తుతం పద్మావతి ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దీపిక, ఆ పనులు పూర్తయ్యాక బయోపిక్ షూటింగ్లో పాల్గొననుంది. ఈ సినిమాకు విశాల్ టీంలో చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న హనీ దర్శకత్వం వహించనున్నాడు. -
ఆన్ లైన్ లో సినిమా మొత్తం లీక్
ముంబయి: మరో సినిమా ఆన్ లైన్ పైరసీ బారిన పడింది. షారూఖ్ ఖాన్ 'రాయిస్', ఆమిర్ ఖాన్ 'దంగల్' ఇటీవల ఆన్ లైన్ లో లీక్ కాగా.. తాజాగా రంగూన్ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా మొత్తాన్ని దుండగులు ఆన్ లైన్ లో పెట్టేశారు. ఈ నెల 24న రంగూన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన వెంటనే ఈ సినిమా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి లోనైంది. సినిమా మొత్తం ఆన్ లైన్ లో వచ్చేయడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడనుంది. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు అంతగా రాలేదు. ఇప్పుడు సినిమా మొత్తం ఇంటర్నెట్ లో వచ్చేయడంతో వసూళ్లు మరింత తగ్గే అవకాశముంది. పైరసీదారులను కనిపెట్టేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన 'రంగూన్'పై మంచి రివ్యూస్ వచ్చాయి. విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సైప్ అలిఖాన్, షాహిద్ కపూర్, కంగనా రౌనత్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
ఆ వెబ్సైటుకు అవార్డు ఇవ్వాలి: సీఎం
అద్భుతమైన ఫిక్షన్ వార్త రాసినందుకు ఓ వెబ్సైటుకు అవార్డు ఇవ్వాలని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. విశాల్ భరద్వాజ్ తీసిన 'హైదర్' సినిమాపై తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఫిర్యాదు చేశానంటూ వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. అసలు తాను ఇంతవరకు ఆ సినిమాయే చూడలేదన్నారు. ఆ సినిమాలో కాశ్మీర్‌ను చెడ్డగా చూపించారంటూ తాను విశాల్ భరద్వాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు ఓ వెబ్సైట్లో వచ్చిన కథనాలన్నీ గాలివార్తలేనని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఇంత అద్భుతమైన ఫిక్షన్ చేసినందుకు ఆ వెబ్‌సైట్‌కు అవార్డు ఇవ్వాలి' అని ఆయన ట్వీట్ చేశారు. వెంటనే ఆ కథనానికి సవరణ వేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అసలు తాను సినిమా చూసినట్లు, ఫిర్యాదు చేసినట్లు వాళ్లు ఎక్కడ విన్నారో తనకు తెలియదని, వాళ్ల నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నానని కూడా అన్నారు. అలనాటి హేమ్లెట్ నాటకం స్ఫూర్తితో విశాల్ భరద్వాజ్ తన 'హైదర్' చిత్రం ద్వారా కాశ్మీర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలను చూపించారు. దీనికి కాశ్మీరీ రచయిత బషరత్ పీర్ కథా సహకారం అందించారు. (ఇంగ్లీషు కథనం) So this website has to be awarded for the most amazing work of fiction I've seen in a very long time. http://t.co/ZxflGLHBiD 1/n — Omar Abdullah (@abdullah_omar) October 8, 2014 Lets be very clear I haven't seen Haider, I don't know when & even if I'll get down to seeing it much less writing to Vishal about it 2/n — Omar Abdullah (@abdullah_omar) October 8, 2014 So where oneindia.in heard that I'd seen the movie & proceeded to complain to Vishal about it I'll never know. I expect a retraction 3/3 — Omar Abdullah (@abdullah_omar) October 8, 2014 -
‘హైదర్’ బాగా భయపెట్టాడు
షాహిద్, విశాల్ భరద్వాజ్ మరోసారి జోడీ కట్టారు. గతంలో విశాల్ తీసిన కమీనేలో షాహిద్ హీరోగా నటించడం తెలిసిందే. ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ రాసిన హామ్లెట్ ఆధారంగా ఇతడు రూపొందించిన హైదర్లోనూ మనోడే హీరో. ఇందులో నటించేటప్పుడు ఎంతో భయంగా, కంగారుగా అనిపించిందని షాహిద్ చెప్పాడు. షేక్స్పియర్ మూడు విషాదాంతాలు మాక్బెత్ (మక్బూల్), ఒథెల్లో (ఓంకార), హామ్లెట్ (హైదర్)ను విశాల్ సినిమాలుగా మలిచాడు. ‘నా కెరీర్లో అన్నింటికంటే గొప్పపాత్ర కమీనే సినిమాలోనిది. మళ్లీ విశాల్‌తో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. హామ్లెట్ వంటి కథలతో తీసే సినిమాల్లో నటించే అవకాశం అతికొద్ది మందికే వస్తుంది. ఇలాంటి పాత్ర చేస్తున్నప్పుడు ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇంకా సాధించాల్సింది చాలా ఉందనిపిస్తుంది. షూటింగ్ సమయంలో భయం వేసినప్పుడల్లా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్లి ధైర్యం తెచ్చుకునేవాడిని. ‘బాగా చేశానా ?’ అంటూ విశాల్‌తోపాటు ఇతరులనూ అడిగేవాణ్ని’ ఈ సినిమా ట్రయలర్ విడుదల సందర్భంగా మీడియాకు షాహిద్ వివరించాడు. హైదర్ అక్టోబర్ రెండున థియేటర్లకు వస్తున్నాడు. తరువాత విశాల్ మాట్లాడుతూ ఎన్నాళ్లుగానో అనుకుంటున్న ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుందని అనుకోలేదని చెప్పాడు. హామ్లెట్‌కు క థ నేపథ్యంగా బాగా నప్పుతుందని చిత్రీకరణకు కాశ్మీర్‌ను ఎంచుకున్నామని, ఇది కుటుంబ కథాచిత్రమని తెలిపాడు. కమీనే వంటి యాక్షన్ సినిమాలు తీసిన విశాల్.. మక్డీ, ది బ్లూ అంబ్రెల్లా వంటి చక్కని బాలల చిత్రాలూ రూపొందించి ప్రశంసలు దక్కించుకున్నాడు. ‘నాకు అన్ని రకాల కథలూ ఇష్టమే. మానవ సంఘర్షణపై ఎక్కువ ఆసక్తి’ అని విశాల్ వివరించాడు. టబూ, కేకే మీనన్, ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. -
‘హామ్లెట్’ నాటకం ఆధారంగా సినిమా
పదేళ్ల తర్వాత విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు టబు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 2003లో విడుదలైన ‘మక్బూల్’ సినీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న విషయం తెలిసిందే. విలియమ్స్ షేక్స్పియర్ రాసిన ‘మాక్బెత్’ నాటకం ఆధారంగా ఆ చిత్రం చేశారు విశాల్. తాజాగా, మరో చిత్రం చేయబోతున్నారు. అది కూడా షేక్స్పియర్ రచనే కావడం విశేషం. షేక్స్పియర్ రాసిన అద్భుతమైన నాటకాల్లో ఒకటైన ‘హామ్లెట్’ ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రకథ అనుకోగానే ఓ కీలక పాత్రకు టబుని అనుకున్నారట విశాల్. ఈ మధ్యకాలంలో ఏ సినిమా పడితే అది ఒప్పుకోవడానికి ఇష్టపడని టబు, కథాబలం, మంచి పాత్రలైతే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ చిత్రం గురించి విశాల్ చెప్పగానే అలానే చేశారట. ఆత్మవిశ్వాసానికి, ఆత్మస్థయిర్యానికి ప్రతీకగా నిలిచే పాత్రను టబు చేయబోతున్నారని విశాల్ పేర్కొన్నారు. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ను సంవత్సరాంతంలో ప్రారంభించాలనుకుంటున్నారు.